కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని కోటి మంది నగర ప్రజల తరఫున కార్పొరేటర్లు ప్రశ్నిస్తే.. బయటకి గెంటెస్తారా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్టును అయన ఖండించారు. హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు కార్పొరేటర్లను అరెస్టు చేయడం దుర్మార్గం అని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో మేయర్ విజయలక్ష్మి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2025-26 […]
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లో బాంబు ఉందంటూ సైబరాబాద్ కంట్రోల్ రూమ్‌కు ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. అప్రమత్తమై ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది ముమ్మర తనిఖీలు చేశారు. ఎక్కడా ఏమీ లభ్యం కాలేదు. బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని భద్రతా సిబ్బంది తేల్చింది. బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని ఎయిర్పోర్ట్ అధికారులు కూడా ధ్రువీకరించారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి తెలంగాణలోని కామారెడ్డి వాసిగా ఎయిర్పోర్ట్ అధికారులు గుర్తించారు. […]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ముందుగా జీహెచ్ఎంసీ కార్యాలయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రతన్ టాటాకు కౌన్సిల్ సభ్యులు నివాళులు అర్పించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.8,440 కోట్ల బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులతో నిరసన తెలిపారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు […]
తెలంగాణ సెక్రటేరియట్లో నకిలీ ఉద్యోగుల వ్యవహారం బయటపడింది. నకిలీ ఉద్యోగుల కదలికలు అనుమానంగా ఉండడంతో సెక్రటేరియట్ సీఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు పూర్తి ఆధారాలు సేకరించి.. చాకచక్యంగా నకిలీ ఉద్యోగులను పట్టుకున్నారు. ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ రోజు ఎస్పీఎఫ్కు నకిలీ ఉద్యోగులు పట్టుబడ్డారు. ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు అనే వ్యక్తి […]
వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌తో ‘ఉస్మానియా ఆసుపత్రి’ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. కోట్ల మంది ప్రజల కోసం 30 లక్షల స్క్వేర్ ఫీట్ల కెపాసిటీతో హాస్పిటల్ బిల్డింగ్స్ నిర్మాణం కాబోతోంది. స్టాఫ్, మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక భవనాలు.. రెండు ఫ్లోర్లలో సెల్లార్ పార్కింగ్ వ్యవస్థ.. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చురీ.. అన్నిరకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు.. ప్రతి డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు.. ఇలా ఇంకా ఎన్నో అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన కొత్త […]
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. విద్యార్థుల మొబైల్‌లకే ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ హాల్‌టికెట్లు రానున్నాయి. విద్యార్థులు ఇచ్చిన మొబైల్ ఫోన్ నంబర్లకు ఇంటర్ బోర్డు అధికారులు లింక్ పంపిస్తున్నారు. ఆ లింక్ క్లిక్ చేస్తే హాల్‌టికెట్ వస్తుందని, డౌన్లోడ్ చేసుకోవచ్చని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. గతంలో కళాశాలలకే హాల్‌టికెట్లను పంపేవారు. విద్యార్థులు తమ తమ కళాశాలలకు వెళ్లి హాల్‌టికెట్లను తీసుకునేవారు. నేటి (జనవరి 30) నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్షలు జరగనున్నాయి. […]
ప్రతిక్షణం ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్న ఆన్లైన్ న్యూస్ మీడియా (వెబ్సైట్, యాప్)కు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలని తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ (ఐ అండ్ పీఆర్) ప్రత్యేక కమిషనర్ ఎస్ హరీష్‌కు తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు స్వామి ముద్దం, పోతు అశోక్ విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్ మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరాన్ని తెలుపుతూ వారు లేఖ అందించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఐ అండ్ పీఆర్ కమిషనర్ త్వరలోనే ఆన్లైన్ […]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కీలకమైన కౌన్సిల్ సమావేశానికి సిద్ధమైంది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరగనుంది. 2025-26 సంవత్సరానికి గాను రూ.8,340 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆమోదించడమే ఎజెండాగా ఈ భేటీ జరగనుంది. సమావేశంలో మొదటగా బడ్జెట్ ప్రతిపాదనపై చర్చ ఉంటుంది. బడ్జెట్ ప్రతిపాదన ఆమోదం అనంతరం ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. కౌన్సిల్ సమావేశానికి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు సిద్దమయ్యారు. బడ్జెట్లో పెట్టిన ప్రతిపాదనపై బీజేపీ […]
దేశవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ ఆదేశాల మేరకు టీమిండియా స్టార్ ఆటగాళ్లంతా రంజీ బాట పట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ బరిలోకి దిగగా.. నేడు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్‌లు రంజీ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యారు. నేటి నుంచి ఆరంభమయ్యే రంజీ ట్రోఫీ గ్రూపు-డి చివరి రౌండ్లో రైల్వేస్‌తో ఢిల్లీ తలపడనుంది. 12 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ తరపున విరాట్ బరిలో దిగుతున్నాడు. […]
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అదరగొడుతున్నాడు. కోల్‌కతాలో జరిగిన తొలి టీ20లో 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టిన చక్రవర్తి.. చెన్నైలో జరిగిన రెండో టీ20లో రెండు వికెట్లు తీశాడు. రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20లో ఐదు వికెట్లతో చెలరేగాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 24 పరుగులే ఇచ్చి ఇంగ్లీష్ జట్టు భారీ స్కోర్ చేయకుండా అడ్డుకట్ట వేశాడు. అందరి ప్రశంసలు అందుకుంటున్న చక్రవర్తి ఖాతాలో ఓ చెత్త […]