Suryakumar Yadav: మా ఓటమికి కారణం అతడే: సూర్య
- మూడో టీ20లో భారత్ ఓటమి
- అదిల్ రషీద్ సూపర్ స్పెల్
- ఓటమిపై స్పందించిన సూర్యకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంగళవారం రాత్రి ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్ ఓడిపోయింది. 172 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లను 145 పరుగులే చేసింది. హార్దిక్ పాండ్యా (40; 35 బంతుల్లో 1×4, 2×6) టాప్ స్కోరర్. జేమీ ఒవర్టన్ (3/24), బ్రైడన్ కార్స్ (2/28) దెబ్బకొట్టారు. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ (51; 28 బంతుల్లో 7×4, 2×6) హాఫ్ సెంచరీ బాదాడు. వరుణ్ చక్రవర్తి (5/24) అద్భుత ప్రదర్శన చేశాడు.
భారత్ ఓటమికి అదిల్ రషీద్ స్పెల్ కారణమని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ‘మ్యాచ్‌కు మంచు ప్రభావం ఉంటుందని భావించా. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ క్రీజ్‌లో ఉన్నప్పుడు మ్యాచ్ గెలుస్తాం అనుకున్నాం. తిలక్ వర్మ దూకుడుగానే ఆడాడు. ఈ విజయం అదిల్ రషీద్‌కే దక్కుతుంది. అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కనీసం స్ట్రైక్ రొటేట్ కూడా చేయనీయలేదు. అందుకే రషీద్ ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్ అయ్యాడు’ అని చెప్పాడు. మూడో టీ20లో ఆదిల్ రషీద్ ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో 15 పరుగులే ఇచ్చి.. ఓ వికెట్ పడగొట్టాడు. కీలక బ్యాటర్ తిలక్ వర్మ (18)ను క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
Also Read
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
- AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
Also Read: Jasprit Bumrah: మరీ పొంగిపోను.. నా కాళ్లు నేలపైనే ఉంటాయి!
‘భారత జట్టులో ఎక్కువ మంది స్పిన్నర్లకు అవకాశం ఇవ్వడానికి కారణం పిచ్. రాజ్‌కోట్ పిచ్ నుంచి మంచి సహకారం లభిస్తుందనే ఉద్దేశంతోనే స్పిన్నర్లను తీసుకుందాం. బౌలింగ్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ సూపర్. బ్యాటింగ్‌లో మేం ఇంకా మెరుగుకావాల్సి ఉంది. ఈ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాం. తదుపరి మ్యాచుకు సిద్దమవుతాం’ అని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. శుక్రవారం నాలుగో టీ20 పుణెలో జరుగుతుంది.
తాజావార్తలు
-
iQOO Pad Pro 8.8: iQOO Pad Pro 8.8 త్వరలో లాంచ్.. 9,020mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లేతో అదిరిపోయే ఫీచర్లు!
-
CM Revanth Reddy : ఎండల సెగ.. నీటి కష్టాలు.? రైతులకు సీఎం అలర్ట్
-
YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
-
Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!