Jasprit Bumrah: మరీ పొంగిపోను.. నా కాళ్లు నేలపైనే ఉంటాయి!
- బుమ్రాకు ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
- 13 టెస్టుల్లో 71 వికెట్లు
- ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు దక్కింది. ఐసీసీ అత్యున్నత పురస్కారం ‘ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ (2024) అవార్డుకు బుమ్రా ఎంపికయ్యాడు. సర్ గ్యారిఫీల్డ్ సోబర్స్ పేరిట ఇచ్చే ఈ పురస్కారం కోసం బుమ్రాతో పాటు జో రూట్, హ్యారీ బ్రూక్, ట్రావిస్ హెడ్ పోటీ పడ్డారు. 2024లో భారత్ టీ20 ప్రపంచకప్ గెలవడంలో బుమ్రా అత్యంత కీలక ప్రాత పోషించాడు. మరోవైపు గతేడాది టెస్టుల్లో స్వదేశం, విదేశం అని తేడా లేకుండా.. అన్ని చోట్లా రాణించాడు. 13 టెస్టు మ్యాచ్‌ల్లో ఏకంగా 71 వికెట్లు పడగొట్టాడు.
సర్ గ్యారిఫీల్డ్ సోబర్స్ అవార్డు దక్కిన సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. ఐసీసీ అత్యున్నత పురస్కారం రావడం పట్ల సంతోషంగా ఉన్నానని, మరీ పొంగిపోవట్లేదని తెలిపాడు. ‘ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ దక్కడం సంతోషంగా ఉంది. ఇదో గొప్ప భావన. నా చిన్నపుడు మన హీరోలు గొప్ప అవార్డులు గెలవడం చూశా. ఇప్పుడు నాకు ఆ అవార్డు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. 2024 టీ20 ప్రపంచకప్ 2024 గెలవడం ఎంతో ప్రత్యేకమైంది. ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోను. టీ20 ప్రపంచకప్ నెగ్గడమే నాకు అత్యంత విలువైంది. సర్ గ్యారిఫీల్డ్ సోబర్స్ పురస్కారం రావడం పట్ల సంతోషంగా ఉన్నా కానీ.. మరీ పొంగిపోను. నా కాళ్లు ఎప్పుడూ నేలపైనే ఉంటాయి’ అని బుమ్రా పేర్కొన్నాడు.
Also Read
- World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
- Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
- High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
Also Read: Rohit Sharma: రోహిత్, యశస్వి, శ్రేయస్ లేకుండానే బరిలోకి జట్టు!
‘ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు గెలిచిన తొలి భారత పేసర్‌గా జస్ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు నలుగురు ఈ అవార్డు గెలిచినా.. అందులో ముగ్గురు బ్యాటర్లు, ఓ స్పిన్నర్ ఉన్నాడు. రాహుల్ ద్రవిడ్ (2004), సచిన్ టెండూల్కర్ (2010), రవిచంద్రన్ అశ్విన్ (2016), విరాట్ కోహ్లీ (2017, 2018) ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు. విరాట్ వరుసగా రెండు ఏళ్లు ఎంపికయ్యాడు.
తాజావార్తలు
-
Minister Seethakka : సీతక్క కీలక ప్రకటన.. అక్టోబర్ 25 నుంచి తెలంగాణలో ‘హ్యామ్’ రోడ్లు
-
World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
-
High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!