Rohit Sharma Retirement: 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై ఎదురైన ఓటమి తర్వాత తాను రిటైర్మెంట్ గురించి ఆలోచించినట్లు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో రోహిత్ నాయకత్వంలోని భారత్ దూకుడు కొనసాగించింది. లీగ్ దశలో వరుసగా 9 విజయాలు సాధించిన భారత్, కీలక మ్యాచ్‌లో మాత్రం తడబడింది. 241 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది.
Read Also: Dhurandhar : ‘ధురంధర్’ లో తమన్నాను డైరెక్టర్ ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..
ఇక, నిన్న (డిసెంబర్ 21న) జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన రోహిత్.. ప్రపంచకప్ గెలవడమే తన ఏకైక లక్ష్యమని, ఆ కల నెరవేరకపోవడంతో పూర్తిగా కుంగిపోయానని చెప్పుకొచ్చారు. మళ్లీ నన్ను నేను సరి చేసుకోవడానికి రెండు నెలల సమయం పట్టింది అని భావోద్వేగానికి గురయ్యాడు. అయితే, ఆ సమయంలోనే 2024 టీ20 ప్రపంచకప్ తన ముందుందని గ్రహించి దానిపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నాడు. “ఇప్పుడు ఈ మాటలు చెప్పడం ఈజీగా అనిపించొచ్చు కానీ ఆ సమయంలో చాలా కష్టంగా ఉందన్నారు. ఒక దశలో ఈ ఆటనే వదిలేయాలని కూడా అనిపించింది.. క్రికెట్ నా నుంచి అన్నింటినీ తీసుకెళ్లింది అనిపించిందని రోహిత్ అన్నారు.
Read Also: Dhurandhar : 8 ఏళ్లు బాహుబలి – 2 రికార్డ్ ను బద్దలు కొట్టిన ధురంధర్
అయితే, ఏడాది లోపే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ పేర్కొన్నారు. 2024 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను విజేతగా నిలిపి తన కలను నెరవేర్చుకున్నాను.. ఆ విజయం అనంతరం టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశా.. టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత కేవలం ఎనిమిది నెలల్లోనే భారత్ మరో ఐసీసీ ట్రోఫీని కూడా గెలుచుకుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది.
Read Also: Palnadu M*urder Case: పల్నాడులో దారుణం.. ఇద్దరు టీడీపీ కార్యకర్తల దారుణ హత్య
కాగా, వన్డే జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతారని భావించిన రోహిత్‌కు సెలెక్టర్లు షాక్ ఇచ్చారు. అతడ్ని కెప్టెన్సీ నుంచి తప్పించి శుభ్‌మన్ గిల్‌కు బాధ్యతలు అప్పగించారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో గిల్ రోహిత్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం రోహిత్ వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉందని అంచనా. ఈలోగా, విజయ్ హజారే ట్రోఫీ ద్వారా ముంబై జట్టు తరఫున మళ్లీ మైదానంలోకి దిగేందుకు రోహిత్ రెడీ అవుతున్నారు.