సంగారెడ్డి డీఎస్పీ ఏ.సత్తయ్య గౌడ్ బూతు పురాణం బయటపడింది. సదశివపేట ఎంఆర్ఎఫ్ కంపెనీ వద్ద ధర్నా చేస్తున్న కార్మికులపై డీఎస్పీ సత్తయ్య నోరు జారారు. ‘నీ అమ్మ చెప్పు తీసుకుని కొడుతా చెత్తనా కొడకా’ అంటూ కార్మికులను డీఎస్పీ బూతులు తిట్టారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న డీఎస్పీ తీరుపట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ వెంటనే తమకు క్షమాపణ చెప్పాలని కార్మికులు డిమాండ్ చేశారు. తమని పర్మినెంట్ చేయాలంటూ సదశివపేట ఎంఆర్ఎఫ్ కంపెనీ బయట 300 […]
తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వణికిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని అన్నానగర్‌లోని పలు చికెన్ సెంటర్లపై గురువారం ఆరోగ్య, టాస్క్‌ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. తనిఖీల్లో పలు చికెన్ షాపుల్లో కుళ్లిన చికెన్ భారీగా పట్టుబడింది. 5 క్వింటాలకు పైగా కుళ్లిన చికెన్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న కుళ్లిన చికెన్‌ను డెయిరీ ఫాం రోడ్డులోని ట్రెంచింగ్ మైదానం వద్ద గొయ్యి తీసి పాతిపెట్టినట్లు హెల్త్ విభాగం సూపరింటెండెంట్ దేవేందర్ తెలిపారు. […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ ఎడిషన్ మార్చి 22న ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2025 మొదటి మ్యాచ్ వేదిక గురించి బీసీసీఐ ఇప్పటికే సమాచారం ఇచ్చినా.. తలపడే టీమ్స్ గురించి మాత్రం చెప్పలేదు. తాజా క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య లీగ్ మొదటి మ్యాచ్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ సొంత నగరమైన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మొదటి మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుంది. గతేడాది రన్నరప్‌గా […]
ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున ముదిగొండ వద్ద మూల మలుపు వద్ద వేగంగా వెళుతున్న గ్రానైట్ ఆటో ట్రాలీ ఒక్కసారిగా బోల్తా పడటంతో.. అందులో ప్రయాణం చేస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన ఎనమిది మందిని స్థానికులు ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం నుంచి ఆటో ట్రాలీలో గ్రానైట్ రాళ్ళు తీసుకుని […]
టీమిండియా వన్డే జట్టులో శ్రేయస్ అయ్యర్ కీలక ఆటగాడు అని, అతడిని తప్పించాలని ఎప్పుడూ అనుకోలేదని భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో రాణించిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు అవకాశం ఇవ్వాలని భావించామని చెప్పాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో శ్రేయస్ 59 పరుగులు చేశాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చి ధనాధన్ ఆటతో అలరించాడు. ఛేదనలో ఇన్నింగ్స్ ఆరంభంలోనే రెండు వికెట్స్ కోల్పోయిన దశలో వచ్చిన శ్రేయస్.. 36 […]
హైదరాబాద్ నగరంలో రోజురోజుకు హోటల్ నిర్వాహకుల ఆగడాలు పెరుగుతున్నాయి. నగరంలో కొన్ని హోటళ్ల యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుస్తోంది. హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా.. కస్టమర్లపై నిర్వాహకులు దాడులకు తెగబడుతున్నారు. ఫుడ్ గురించి ఎవరైనా ప్రశ్నించినా లేదా ఫిర్యాదు చేసినా మూకుమ్మడి దాడి చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలా జరగగా.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తీనాపురం ‘దావత్’ బిర్యానీ హోటల్ నిర్వహకులు కస్టమర్స్‌పై దాడి చేశారు. Also Read: Caste […]
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణపై నేడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం జరగనుంది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమంకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీలు చీఫ్ గెస్టులుగా హాజరుకానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు గాంధీభవన్‌లోని ప్రకాశం హాల్లో కులగణన, ఎస్సీ వర్గీకరణలపై కాంగ్రెస్ నేతలకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. Also Read: Rajat […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత ఆకర్షణీయ జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు కెప్టెన్‌గా రజత్ పటీదార్ ఎంపికైన విషయం తెలిసిందే. రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు నడిపించిన ఆర్సీబీకి.. పెద్దగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడని రజత్ సారథిగా నియమితుడు కావడం అందిరినీ ఆశ్చర్యం కలిగించే విషయమే. అంతేకాదు మూడేళ్ల ముందు ఐపీఎల్లో అమ్ముడే కాని ఈ 31 ఏళ్ల ఆటగాడు.. ఆర్సీబీకి […]
జనగామ జిల్లా ఏర్పడిందంటే అది మాజీ సీఎం కేసీఆర్ కృషితోనే అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఉమ్మడి పాలనలో జనగామ ప్రాంతం అన్యాయానికి గురైందని, ప్రత్యేక జిల్లా ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాతే జిల్లా ఏర్పడడం కాకుండా.. జిల్లా అభివృద్ధికి బాటలు పడ్డాయన్నారు. బీసీ ఉద్యమాలు చేసి.. బీసీలకు న్యాయం చేసే లాగా కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు ప్రయత్నం చేసిందన్నారు. ప్రభుత్వం బిల్లులు సక్రమంగా పెట్టి బీసీ […]
రంగారెడ్డి జిల్లా కోర్టులో ఉద్రిక్తత నెలకొంది. జీవిత ఖైదు పడిన ఓ నేరస్తుడు న్యాయమూర్తి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. రంగారెడ్డి ఫోక్స్ కోర్టు న్యాయమూర్తిపై ముద్దాయి చెప్పు విసిరాడు. ఫోక్సో కేసులో ముద్దాయిగా ప్రకటించడంతో జిర్ణించుకోలేకపోయిన నిందితుడు.. న్యాయమూర్తిపై ఒక్కసారిగా చెప్పు విసిరాడు. కోర్టులో ఉన్న న్యాయవాదులు నేరస్తుడిని పట్టుకుని చితకబాది.. పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో కోర్టులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.