గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. కూలీలతో వెళ్తున్న ఆటోను బుడంపాడు సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గరు వ్యవసాయ కూలీలు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనుల కోసం వెళ్తున్న మహిళలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమన్నారు. మృతులు అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని సీఎం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. రైతు కూలీలతో వెళుతున్న […]
2025 ‘సంక్రాంతి’ పర్వదినం పురస్కరించుకొని ప్రారంబమైన ‘స్విస్ ఇండియన్ స్పోర్ట్స్ లీగ్’ ఫిబ్రవరి 15తో ముగిసింది. ప్రారంభ సీజన్లో ‘వరంగల్ వారియర్స్’ టీమ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో వరంగల్ వారియర్స్ 6 పరుగుల తేడాతో కాకతీయ నైట్ రైడర్స్‌పై గెలుపొందింది. ఇటీవల దావోస్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్రీడాకారుల సమక్షంలో ట్రోఫీని ప్రదర్శించారు. వరంగల్ వారియర్స్ నిలకడగా ఆడి 5 లీగ్ గేమ్‌లలో 4 గెలిచి.. లీగ్ పట్టికలో […]
మాజీ ఎంపీ కేశినేని నాని కీలక ప్రకటన: గత లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఓడిపోయిన విషయం తెలిసిందే. తమ్ముడు కేశినేని చిన్ని (శివనాథ్) చేతిలో ఓటమిపాలయ్యాక నాని రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీ నుంచి పోటీచేసి ఓడిన అనంతరం రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్టు ప్రకటన కూడా చేశారు. అయితే ఇటీవలి రోజుల్లో కేశినేని నాని రాజకీయాల్లోకి వస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై సోషల్ మీడియాలో కేశినేని […]
గత లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఓడిపోయిన విషయం తెలిసిందే. తమ్ముడు కేశినేని చిన్ని (శివనాథ్) చేతిలో ఓటమిపాలయ్యాక నాని రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీ నుంచి పోటీచేసి ఓడిన అనంతరం రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్టు ప్రకటన కూడా చేశారు. అయితే ఇటీవలి రోజుల్లో కేశినేని నాని రాజకీయాల్లోకి వస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై సోషల్ మీడియాలో కేశినేని నాని స్పందించారు. తన నిర్ణయం మారదని, ప్రజలకు […]
నేడు తిరుపతికి ముగ్గురు ముఖ్యమంత్రులు రానున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌లు తిరుపతికి రానున్నారు. తిరుపతిలో జరగనున్న రెండవ ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో ప్రారంభోత్సవంకు ముగ్గురు ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో సమావేశం మూడు రోజుల పాటు జరగనుంది. ఈ మూడు రోజులు నిపుణుల నేతృత్వంలో దేవాలయాలపై చర్చలు, ప్రదర్శనలు, వర్క్ షాపులు జరగనున్నాయి. […]
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీ మహిళలు ప్రయాణిస్తున్న ఆటోను పల్లె వెలుగు బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో ఏడుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మినుము చేను పీకడానికి సుద్ధపల్లి నుండి కంతేరుకు 10 మంది మహిళా కూలీలు ఈరోజు ఉదయం ఆటోలో బయల్దేరారు. చేబ్రోలు మండలం […]
అవినీతి అధికారులపై ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మండిపడ్డారు. అవినీతి చేస్తే తానే స్వయంగా ఏసీబీకి పట్టిస్తా అని హెచ్చరించారు. మైదుకూరు నియోజకవర్గ వ్యాప్తంగా అధికారుల అవినీతిపై బాధితులు తనను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. కొందరు అధికారులు బాగా పనిచేస్తున్నారని, కొందరు మాత్రమే అవినీతికి పాల్పడుతున్నారన్నారు. అవినీతి అధికారులకు మీడియా ద్వారా ఇదే ఫైనల్ వార్నింగ్ అని ఎమ్మెల్యే పుట్టా హెచ్చరించారు. నియోజకవర్గంలో తాను అవినీతి చేయను అని, అధికారులు అవినీతికి పాల్పడితే ఒప్పుకునేది లేదన్నారు. ఎమ్మెల్యే పుట్టా […]
కడప ఎస్వీ డిగ్రీ కళాశాల ఆవరణలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరుగుతోంది. ఎమ్మెల్యే మాధవి జాబ్ మేళాను ప్రారంభించారు. రాయలసీమ వ్యాప్తంగా నిరుద్యోగ అభ్యర్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. 52 ప్రైవేట్ కంపెనీలలో 5700 ఉద్యోగాల కోసం సుమారు పది వేల మంది నిరుద్యోగ అభ్యర్థులు హాజరయ్యారు. మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కడప నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవి, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీనివాసులు హాజరయ్యారు. ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ… […]
ప్రజల ఆరోగ్యం ఎంతో ముఖ్యం: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆరోగ్యం ఎంతో ముఖ్యం అని.. ప్రజల ఆరోగ్యం బాగుంటే వ్యక్తిగత ఆదాయం పెరుగుతుందని, తద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్రంలో చెత్తను సద్వినియోగం చేసుకునేందుకు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెడుతున్నాం అని.. నెల్లూరు, కాకినాడ, రాజమహేంద్రవరంలతో పాటు రాయలసీమలో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే రెండేళ్లలో ఏపీని చెత్త రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దాలనేది తమ లక్ష్యం అని మంత్రి […]
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆరోగ్యం ఎంతో ముఖ్యం అని.. ప్రజల ఆరోగ్యం బాగుంటే వ్యక్తిగత ఆదాయం పెరుగుతుందని, తద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్రంలో చెత్తను సద్వినియోగం చేసుకునేందుకు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెడుతున్నాం అని.. నెల్లూరు, కాకినాడ, రాజమహేంద్రవరంలతో పాటు రాయలసీమలో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే రెండేళ్లలో ఏపీని చెత్త రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దాలనేది తమ లక్ష్యం అని మంత్రి నారాయణ చెప్పారు. నెల్లూరు సిటీ […]