జనగామ జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ రోడ్డులోని ‘జై భవాని’ హార్డ్ వేర్, ఎలక్ట్రికల్ అండ్ పెయింటింగ్ షాపులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా.. ఫైర్ సిబ్బంది వెంటనే అలెర్ట్ అయింది. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని జనగామ పట్టణ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. Also Read: Shubman […]
టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 2500 పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. తన 50 వన్డే మ్యాచ్‌లో గిల్ ఈ మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ హషీమ్ ఆమ్లా (53 ఇన్నింగ్స్‌ల్లో) రికార్డును బద్దలు కొట్టాడు. బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో గిల్ 102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సులతో 112 రన్స్ బాదాడు. 2019 జనవరి […]
ఇచ్చిన మాట తప్పడంలో కాంగ్రెస్ ముందు వరుసలో ఉంటుందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. నిన్న రాహుల్ గాంధీ వరంగల్‌కు రావాలి అనుకొని కూడా రాలేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వరంగల్ ప్రజలు అడుగుతారఅని రాహుల్ రాలేదన్నారు. ఎన్నికల ముందు మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చారని, ఆ హామీలు నెరవేర్చే వరకు వెంటబడతాం అని హెచ్చరించారు. మార్చి 8న మహిళా శంఖారావం జరగబోతోందని, ఇందిరా పార్కు దగ్గర జరిగే ఈ మీటింగ్‌లో మహిళల సత్తా చాటుతాం అని కవిత […]
హైదరాబాద్ శివారు మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో కోడిపందేలు, క్యాసినో నిర్వహణ గుట్టు రట్టయింది. క్యాసినో, కోడిపందేలు ఆడుతున్న వారిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోడిపందేలతో పాటు క్యాసినో నిర్వహిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఫామ్‌హౌస్‌పై దాడిలో మొత్తంగా 64 మందిని అరెస్ట్ చేశారు. ఆర్గనైజర్లు భూపతి రాజు, శివకుమార్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడిలో 30 లక్షల రూపాయల నగదు, 55 లగ్జరీ కార్లు, 86 పందెం కోళ్లు, బెట్టింగ్ కాయిన్స్, పేకాట కార్డ్స్, పందెం […]
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై ఈ నెల 17 లోపు నిర్ణయం తీసుకుంటామని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. త్వరలో మాజీ సీఎం కేసీఆర్‌తో బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశం అవుతారని చెప్పారు. బీసీ మూమెంట్ చాలా ఎక్కువగా ఉందని, ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం బీసీ జనాభా చాలా తక్కువగా ఉందన్నారు. రీసర్వే చేస్తే కేసీఆర్, కేటీఆర్ కూడా పాల్గొంటారని తలసాని చెప్పుకొచ్చారు. ఈనెల 25న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నేపథ్యంలో మాజీమంత్రి తలసాని […]
అహ్మదాబాద్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే మ్యాచ్ ఆరంభం అయింది. ఈ వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లీష్ కెప్టెన్ జోస్ బట్లర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ వరుసగా పదో సారి టాస్ ఓడిపోయింది. ఇప్పటికే సిరీస్ గెలుచుకోవడంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మూడు మార్పులు చేశాడు. రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమీకి రెస్ట్ ఇవ్వగా.. వారి స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ ఎంట్రీ […]
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా ఉన్న చోట పోటీ చేస్తాం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తే ముందుకూ వెళ్తామని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నాం అని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల అభ్యర్ధుల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై చర్చిస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన చేయడాన్ని తాను స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి పోకడకు వెళ్లకుండా […]
హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో కోడిపందేలు, క్యాసినో నిర్వహణ గుట్టు రట్టయింది. క్యాసినో, కోడి పందాలు ఆడుతున్న వారిని రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. కోళ్ల పందాలతో పాటు క్యాసినో నిర్వహిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఫామ్‌హౌస్‌పై దాడిలో మొత్తంగా 64 మందిని అదుపులోకి తీసుకోగా.. ఇందులో ఆర్గనైజర్లు భూపతి రాజు, శివకుమార్ కూడా ఉన్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన పలువురు ప్రముఖులు క్యాసినో, కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. మొయినాబాద్ తోల్కట్టలోని […]
నేడు తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం కానుంది. ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర పార్టీలతో ఈసీ సమావేశం అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘నోటా’ తప్పనిసరి, ఓటర్ల తుది జాబితా ఖరారుపై చర్చ జరగనుంది. ట్రయల్ ప్రాతిపదికన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నోటాను కూడా ఒక అభ్యర్థిగా పెట్టాలని ఎన్నికల కమిషన్ అనుకుంటోంది. ఇప్పటికీ ఈ పద్ధతిని పలు రాష్ట్రాలు పాటిస్తున్నాయి. సర్పంచ్ పదవికి జరిగే ఎన్నికలలో నోటాను ‘కల్పిత ఎన్నికల అభ్యర్థి’గా పరిగణించడం […]
రాష్ట్ర వ్యాప్తంగా 16 వేలకు పైగా ఉన్న హోంగార్డులకు 12 రోజులు గడస్తున్నా.. ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు చేతిలో చిల్లిగవ్వలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫైర్ అయ్యారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చెయ్యాల్సిన దుస్థితి నెలకొందన్నారు. పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వాతలు అంటూ ఎక్స్‌లో హరీశ్ రావు విమర్శలు […]