MLC Kavitha: జనగామ జిల్లా ఏర్పడింది కేసీఆర్ కృషితోనే.. బీసీ బిల్లుల కోసం ఉద్యమం చేయాలి!
- జనగామ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటన
- పెంబర్తి విశ్వకర్మ హస్తకళల కేంద్రంను సందర్శించిన కవిత
- పెంబర్తి గ్రామంలో బస్సులు ఆగాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనగామ జిల్లా ఏర్పడిందంటే అది మాజీ సీఎం కేసీఆర్ కృషితోనే అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఉమ్మడి పాలనలో జనగామ ప్రాంతం అన్యాయానికి గురైందని, ప్రత్యేక జిల్లా ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాతే జిల్లా ఏర్పడడం కాకుండా.. జిల్లా అభివృద్ధికి బాటలు పడ్డాయన్నారు. బీసీ ఉద్యమాలు చేసి.. బీసీలకు న్యాయం చేసే లాగా కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు ప్రయత్నం చేసిందన్నారు. ప్రభుత్వం బిల్లులు సక్రమంగా పెట్టి బీసీ బిడ్డలకు లాభం చేసేలాగా, బీసీ బిల్లులు పెట్టేలాగా మనందరం ఐక్యంగా ఉద్యమం చేయాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు జనగామ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం 10.30 గంటలకు పెంబర్తి గ్రామంలోని విశ్వకర్మ హస్తకళల కేంద్రంను సందర్శించిన కవిత.. 11.30కి పెంబర్తి గ్రామ్ పంచాయత్ కార్యాలయం వద్ద ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి నివాళులు అర్పించారు. పెంబర్తి పర్యటన అనంతరం జనగామ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. ‘జనగామ జిల్లా ఏర్పడిందంటే అది కేసీఆర్ కృషితోనే. ఉమ్మడి పాలనలో జనగామ ప్రాంతం అన్యాయానికి గురైంది. ప్రత్యేక జిల్లా ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. కేసీఆర్ వచ్చిన తర్వాతే జిల్లా ఏర్పడడం కాకుండా.. అభివృద్ధికి బాటలు పడ్డాయి. మెడికల్ కాలేజీ, కలెక్టరేట్ ఇలా అన్ని రకాల అభివృద్ధి జరిగిందంటే అది కేసిఆర్ ప్రభుత్వంతోనే. పెంబర్తిలో ఉన్న హస్తకళల సెంటర్ పరిశీలించాను. ఉచిత బస్సు పెట్టారు కానీ.. పెంబర్తిలో బస్సు ఆగుతలేదు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పెంబర్తి గ్రామంలో బస్సులు ఆగాలి’ అన్నారు.
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని బీఆర్ఎస్ మాట ఇచ్చింది. బీసీ ఉద్యమాలు చేసి.. బీసీలకు న్యాయం చేసేలాగా కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు ప్రయత్నం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ బీసీల గురించి చెబుతుందంటే దాన్ని కారణం తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ చేసిన ఉద్యమమే కారణం. విద్యలో, ఉద్యోగాల్లో, రాజకీయ రిజర్వేషన్ల కోసం వేరువేరు బీసీ బిల్లులు పెట్టాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మళ్లీ రీసర్వే చేస్తామని చెప్తున్నారు. మీరు ఇచ్చిన మాట ప్రకారం మళ్లీ రీసర్వే చేయండి. హైదరాబాదులో 40 శాతం ఇళ్లులు రాలేదని జనం చెబుతున్నారు. ఎవరైతే మిస్సయ్యారో వాళ్ళందరికీ తెలిసే లాగా విస్తృతంగా ప్రయత్నం చేయండి. ఉపకులాలు చేర్చుకునే లాగా అవకాశం కల్పించండి. బీసీ బిల్లు పెడతామని కాంగ్రెస్ చెప్పడం మన తొలి విజయం మాత్రమే. బిల్లులు సక్రమంగా పెట్టి బీసీ బిడ్డలకు లాభం చేసేలాగా బీసీ బిల్లులు పెట్టేలాగా మనందరం ఐక్యంగా ఉద్యమం చేయాలి’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
Live: Addressing media at Jangaon BRS Party Office https://t.co/yXPxEAhspH
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 13, 2025
- Tags
- BRS
- jangaon
- kcr
- MLC Kavitha
- pembarthi
తాజావార్తలు
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!