Rotten Chicken: అన్నానగర్‌లో చికెన్ షాపులపై దాడులు.. 5 క్వింటాలకు పైగా కుళ్లిన చికెన్ సీజ్!
- అన్నానగర్‌లో చికెన్ షాపులపై దాడులు
- 5 క్వింటాలకు పైగా కుళ్లిన చికెన్ సీజ్
- లైసెన్సు రద్దు చేసి.. వ్యాపారులపై కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వణికిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని అన్నానగర్‌లోని పలు చికెన్ సెంటర్లపై గురువారం ఆరోగ్య, టాస్క్‌ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. తనిఖీల్లో పలు చికెన్ షాపుల్లో కుళ్లిన చికెన్ భారీగా పట్టుబడింది. 5 క్వింటాలకు పైగా కుళ్లిన చికెన్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న కుళ్లిన చికెన్‌ను డెయిరీ ఫాం రోడ్డులోని ట్రెంచింగ్ మైదానం వద్ద గొయ్యి తీసి పాతిపెట్టినట్లు హెల్త్ విభాగం సూపరింటెండెంట్ దేవేందర్ తెలిపారు.
అన్నానగర్‌లోని ఓ చికెన్ దుకాణంపై ఫిర్యాదు అందగా.. ఆహార భద్రత టాస్క్‌ఫోర్స్ అధికారులతో కలిసి కంటోన్మెంట్ అధికారులు వెంటనే దాడులు జరిపారు. ఎస్‌ఎస్‌ఎస్ చికెన్ సెంటర్, రవి చికెన్ సెంటర్ లాంటి దుకాణాలపై దాడులు చేసి.. 5 క్వింటాలకు పైగా కుళ్లిన చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని పలు వైన్ షాపులు, బార్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు తక్కువ ధరలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. మూడు నెలల పాటు కెమికల్స్ కలిపి కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ ఉంచుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పారు. చికెన్ పాడవకుండా ప్రమాదకరమైన ఫార్మలిన్ కలుపుతున్నట్లు నిర్ధారించారు. బర్డ్ ఫ్లూ వైరస్ కంటే ప్రమాదకరమైన కెమికల్స్ కలుస్తున్నాయంటూ అధికారుల గుర్తించారు. గతంలో ఇదే షాపుల్లో భారీగా కుళ్లిన చికెన్‌ను పట్టుకున్నారు. చికెన్ షాపుల లైసెన్సు రద్దు చేసి.. వ్యాపారులపై కేసు నమోదు చేశారు.
Also Read
- Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
- AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
- Team India Squad: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
- RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్‌న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
తాజావార్తలు
-
Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
-
AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
-
Team India Squad: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
-
RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్‌న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!