హైదరాబాద్ నగరంలో రోజురోజుకు హోటల్ నిర్వాహకుల ఆగడాలు పెరుగుతున్నాయి. నగరంలో కొన్ని హోటళ్ల యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుస్తోంది. హైదరాబాద్లో ఎక్కడ చూసినా.. కస్టమర్లపై నిర్వాహకులు దాడులకు తెగబడుతున్నారు. ఫుడ్ గురించి ఎవరైనా ప్రశ్నించినా లేదా ఫిర్యాదు చేసినా మూకుమ్మడి దాడి చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలా జరగగా.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తీనాపురం ‘దావత్’ బిర్యానీ హోటల్ నిర్వహకులు కస్టమర్స్‌పై దాడి చేశారు.
Also Read: Caste Survey: నేడు కులగణన, ఎస్సీ వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్!
హస్తీనాపురంలోని దావత్ బిర్యానీ హోటల్ సిబ్బంది కస్టమర్స్‌పై దాడికి పాల్పడ్డారు. హోటల్ మేనేజర్ దగ్గరుండి మరీ దాడి చేయించాడు. బాధితులు మీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హోటల్‌లో జరిగిన దాడి సీసీటీవీలో రికార్డ్ అయింది. హోటల్ సిబ్బందిని కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. సీసీటీవీని మీర్‌పేట్ పోలీసులు పరిశీలిస్తున్నారు. మేనేజర్ ఎందుకు దాడి చేయించాడు? అని ఆరా తెస్తున్నారు. ఫుడ్ గురించి ఏమైనా గొడవ జరిగిందా? లేదా ఏవైనా పాత గొడవ ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.