తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణపై నేడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం జరగనుంది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమంకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీలు చీఫ్ గెస్టులుగా హాజరుకానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు గాంధీభవన్‌లోని ప్రకాశం హాల్‌లో కులగణన, ఎస్సీ వర్గీకరణలపై కాంగ్రెస్ నేతలకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
Also Read: Rajat Patidar RCB: మూడేళ్ల ముందు అమ్ముడే పోలేదు.. ఇప్పుడు ఏకంగా కెప్టెన్!
కులగణన, ఎస్సీ వర్గీకరణపై డిప్యూటీ సీఎం భట్టి.. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క.. ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని పీసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీసీసీ ఆఫీసు బేరర్లు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు పాల్గొంటారు. ప్రతి జిల్లాలోని సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు అందరూ విధిగా పాల్గొని కార్యక్రమంను విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ కోరారు.