ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున ముదిగొండ వద్ద మూల మలుపు వద్ద వేగంగా వెళుతున్న గ్రానైట్ ఆటో ట్రాలీ ఒక్కసారిగా బోల్తా పడటంతో.. అందులో ప్రయాణం చేస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన ఎనమిది మందిని స్థానికులు ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.
ఖమ్మం నుంచి ఆటో ట్రాలీలో గ్రానైట్ రాళ్ళు తీసుకుని వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాలీ మీద ప్రయాణం చేస్తున్న వారిపై గ్రానైట్ బండలు పడటంతో ఇద్దరు మృతి చెందగా.. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న ముదిగొండ పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఖమ్మం సమీపంలోని ఖానాపురం హవేలీకి సంబంధించిన వ్యక్తులు అని పోలీసులు గుర్తించారు.