హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్ మండలం తొల్కట్ట ఫామ్‌హౌస్‌లో క్యాసినో, కోడిపందేల నిర్వహణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కోడిపందేలు జరిగిన ల్యాండ్ శ్రీనివాస్‌కి చెందినదిగా నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. మాదాపూర్‌లోని శ్రీనివాస్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేసిన పోలీసులు.. కోడిపందేల నిర్వహణపై సమగ్ర వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. తోల్కట్ట గ్రామం సర్వే నెంబర్ 165/aపై నాలుగు రోజుల్లో ఆధారాలతో తమ ముందు హాజరుకావాలని పోలీసులు ఆయనకు […]
హైదరాబాద్ జర్నీలో ‘మైక్రోసాఫ్ట్’ నూతన క్యాంపస్ ప్రారంభం మరో మైలురాయి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందన్నారు. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయన్నారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే అని, మైక్రోసాఫ్ట్ కృషితో 500 పాఠశాలల్లో కృత్రిమ మేధ (ఏఐ) బోధన ప్రవేశపెడతాం అని సీఎం చెప్పారు. తెలంగాణపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ లీడర్షిప్ టీమ్‌కు సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. మైక్రోసాఫ్ట్ నూతన […]
బీసీ జాబితాలో ముస్లింలను చేర్పిస్తే ఆమోదించే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం అని పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ది కాంగ్రెస్ పార్టీకి లేదని తేటతెల్లమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు మరింత అన్యాయం చేస్తోందని, ముస్లింలను బీసీల్లో కలిపితే హిందూ సమాజమంతా తిరగబడటం ఖాయమన్నారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ది ఉంటే బీసీ జాబితాలో నుండి ముస్లింలను తొలగించాల్సిందే అని, ఎన్నికల హామీ మేరకు […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రాంచైజీ కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. యువ బ్యాటర్ రజత్ పటీదార్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ ఆర్సీబీ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. రజత్ పాటిదార్, కృనాల్ పాండ్యాలు ఆర్సీబీ కెప్టెన్ రేసులో ఉన్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. గత సీజన్లో జట్టుకు సారథ్యం వహించిన దక్షిణాఫ్రికా […]
చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధానార్చకులు సీఎస్ రంగరాజన్‌పై దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవ రెడ్డి సహా ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిజామాబాద్‌కి చెందిన నాగనపల్లి సాయన్న, ఖమ్మంకి చెందిన భూక్యా గోపాల్ రావు, భూక్యా శ్రీను, అంకోలు శిరీష, బేబి రాణిలు అరెస్ట్ అయ్యారు. ప్రధాన నిందితుడు వీర రాఘవ రెడ్డిపై అబిడ్స్, బంజారాహిల్స్, గోల్కొండ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నిందితుల రిమాండ్ రిపోర్టులో […]
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామంలో గేదెల కోసం తీసుకున్న లోన్ కట్టలేదని డీసీసీబీ బ్యాంక్ అధికారులు ఇంటి గేటు పీక్కెళ్లిన విషయం తెలిసిందే. లోన్ చెల్లించలేదని రైతు ఇంటి గేటును ట్రాక్టర్ తీసుకొచ్చి మరి బ్యాంక్ అధికారులు తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణం కట్టలేదని ఇంత […]
రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా సర్వే చేశాం అని, మిస్ అయిన వారి కోసం మరో అవకాశం ఇస్తున్నాం అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇది రీసర్వే కాదని, ఇది మిస్ అయిన వారికోసం మాత్రమే అని స్పష్టం చేశారు. సర్వేలో పాల్గొనని బీఆర్ఎస్ వారికి సర్వే గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. రాజకీయ విమర్శల కొసమే బీసీ ముస్లింల మీద బీజేపీ వారు విమర్శలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్లోని మూడు పదవులలో […]
భాగ్యనగరంలో దోపిడీలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దుండగులు భారీగా బంగారం, నగదును దోచుకెళ్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఇటీవలి రోజుల్లో వరుస చోరీలతో జనాలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా హిమాయత్ నగర్లో భారీ చోరీ జరిగింది. ఓ బంగారం వ్యాపారి ఇంట్లో భారీగా బంగారం, నగదు దోచుకెళ్లారు దొంగలు. వ్యాపారి లబోదిబోమంటూ హిమాయత్ నగర్ పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలలం రేపింది. వివరాల ప్రకారం.. హిమాయత్ నగర్లో నివాసం ఉండే బంగారం వ్యాపారి […]
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు పెంబర్తి గ్రామంలోని విశ్వకర్మ హస్తకళల కేంద్రంను కవిత సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రేఖ రాజ్‌ను పరామర్శిస్తారు. ఉదయం 11.30కి పెంబర్తి గ్రామ్ పంచాయత్ కార్యాలయం వద్ద ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతారు. Also Read: Champions Trophy 2025: ఐదుగురు స్టార్స్ […]
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఏకంగా ఐదుగురు స్టార్ ప్లేయర్స్ దూరమయ్యారు. గాయాల కారణంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, పేసర్ జోష్ హేజిల్‌వుడ్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ వైదొలగగా.. ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయినిస్ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ కూడా తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో స్టార్క్ టోర్నీకి దూరమయ్యాడు. కీలక ఆటగాళ్లు దూరమైన నేపథ్యంలో 15 మంది సభ్యుల జట్టులో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) పలు మార్పులు చేసింది. గాయం కారణంగా […]