గవర్నర్ ప్రసంగం, బడ్జెట్‌పై మాట్లాడటం కోసం మీడియా సమావేశం ఏర్పాటు చేయటం జరిగిందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్షం వర్షన్ వినిపించే అవకాశం లేకపోవటంతో.. తమ వైపు నుంచి ప్రజలకు వివరించటం కోసమే ఈ సమావేశం అని తెలిపారు. సీఎం చంద్రబాబు వచ్చాక రెండు బడ్జెట్లలో ప్రజలను మోసం చేయటం ప్రస్ఫుటంగా కనిపిస్తుందన్నారు. ఎన్నికల ముందు చెప్పినట్లుగా గాక.. ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. […]
శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమాచారం ఇచ్చారు. నామినేషన్‌కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ ఆదేశించారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్నారు. ఇటీవల ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో […]
ప్రభుత్వం ఎక్కడా వ్యక్తిగత కక్షలకు వెళ్లడం లేదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చామన్నారు. స్పీకర్‌పై తప్పుడు రాతలు బాధాకరమన్నారు. ఎవరు ఎక్కడ ఉండాలో ప్రజలు నిర్ణయిస్తారని, ప్రజాప్రతినిధులుగా ప్రజలు తరపున పోరాడాల్సి ఉందన్నారు. ఎవరు అధికారంలో ఉన్నా ఇది కరెక్టు కాదని, చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు జరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి చెప్పుకొచ్చారు. బుధవారం అసెంబ్లీలో మంత్రి […]
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదాపై అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక ప్రకటన చేశారు. ప్రతిపక్ష హోదాపై నిరాధార ఆరోపణలతో జగన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఎంతటి వారిపైనైనా అసత్యాలు ప్రచారం చేసే ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారు. స్పీకర్‌కు దురుద్దేశాలు ఆపాదించడం సభా నియమాల ఉల్లంఘన కిందికి వస్తుందన్నారు. సంధి ప్రేలాపనలుగా పరిగణించి సభాపతి హోదాలో క్షమిస్తున్నా అని, తప్పుడు ప్రచారానికి తెరదించేందుకు రూలింగ్ ఇవ్వాలని నిర్ణయించాను అని స్పీకర్ తెలిపారు. బుధవారం […]
నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మార్చి 5,6 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి.. విజయవాడ పోరంకిలోని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నివాసానికి సీఎం వెళ్లనున్నారు. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లి.. మధ్యాహ్నం 1.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సీతారామన్, నితిన్ గడ్కరీలను ఏపీ సీఎం కలవనున్నారు. ఇవాళ […]
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మార్చి 5,6 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి.. విజయవాడ పోరంకిలోని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నివాసానికి సీఎం వెళ్లనున్నారు. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లి.. మధ్యాహ్నం 1.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సీతారామన్, నితిన్ గడ్కరీలను ఏపీ సీఎం కలవనున్నారు. ఇవాళ రాత్రి 8 గంటలకు ఓ వివాహ […]
తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నేటి నుంచి మొదలుకానున్నాయి. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం, ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. మొదటి, రెండో సంవత్సరం కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 4 లక్షల 88 వేల 448 మంది కాగా.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5 లక్షల 8 వేల 523 మంది […]
భారత సారథి, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా మంగళవారం దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి సెమీ ఫైనల్లో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. ఆసీస్ పేసర్ నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా హిట్‌మ్యాన్ సిక్సర్ బాదాడు. ఐసీసీ వన్డే టోర్నీల్లో రోహిత్‌కు ఇది 65వ సిక్స్. ఈ క్రమంలో యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ […]
ఇవాళ ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. ఒక వివాహ కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర బడ్జెట్, సూపర్ సిక్స్ హామీల అమలు, అన్నదాతల కష్టాలు, అక్రమ అరెస్టులు సహా అనేక అంశాలపై మీడియాతో జగన్ మాట్లాడనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. మండలిలో టీడీపీ, సభ్యుల మాటల యుద్ధం […]
నాపై ఆరోపణలు చేస్తే మీ ఇంటికొస్తా: వచ్చే ఎన్నికలలో చంద్రగిరి నుంచే తాను పోటి చేస్తా అని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి, టీడీపీ మహిళా నేత సుధారెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి చంద్రగిరి రెండు స్దానాలు అవుతాయిని, ఖచ్చితంగా తాను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోటీ చేస్తానన్నారు. అవీనితి చేసిన చెవిరెడ్డి చట్టప్రకారం జైలుకు పోతాడన్నారు. చెవిరెడ్డి, ఆయన సతీమణి ఆస్తుల వివరాలను ఇంటింటికి కరపత్రాలు చేసి పంచుతానని హెచ్చరించారు. చంద్రగిరి టవర్ […]