ఇప్పటివరకు ఏపీలో 14 వేల పెన్షన్లు తొలగించాము అని, కానీ లక్షల్లో పెన్షన్లు తొలగిస్తున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పెన్షన్లపై సర్వే పకడ్బందీగా జరుగుతోందని, అనర్హులకు పెన్షన్ తీసేసినా తప్పులేదన్నారు. 2019 జూన్ నాటికి సామాజిక భద్రత పెన్షన్ల కింద 53 లక్షల 85 వేల 796 మంది లబ్ధిదారులు ఉండగా.. ప్రస్తుతం 63 లక్షల 59 వేల 907 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారని మంత్రి కొండపల్లి చెప్పారు. ఏపీ అసెంబ్లీలో […]
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరవ రోజు కొనసాగుతున్నాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై శాసన సభలో సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్‌ను సభ్యులు ప్రశ్నలు అడిగారు. అక్రమార్కులపై ఏ మేరకు చర్యలు తీసుకుంటున్నారని సభ్యులు అడగగా.. మంత్రి నాదెండ్ల సమాధానం చెప్పారు. గత ప్రభుత్వం వ్యవస్థీకృతంగా పీడీఎస్ రైస్ అంటే.. స్మగ్లింగ్ రైస్‌గా మార్చేశారన్నారు. అక్రమ రవాణా అరికట్టడానికి సివిల్ సప్లైస్ చట్టాలు, పీడీ యాక్టులలో సవరణలు తెచ్చి చట్టాలలో మార్పులు తెచ్చామన్నారు. త్వరలో క్యూఆర్ […]
తమ డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్లు రాజమండ్రి నుండి ‘ఛలో విజయవాడ’కు బయలుదేరారు. ఛలో విజయవాడకు బయల్దేరిన పలువురు ఆశా వర్కర్లను రైల్వేస్టేషన్లో టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆశా వర్కర్లు చలో విజయవాడకు వెళ్లకుండా పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు. దాంతో నగరంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులపై ఆశా వర్కర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ చలో విజయవాడకు ఆశా వర్కర్లు పిలుపునిచ్చారు. […]
మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపైకి తోడల్లుళ్లు: మూడు దశాబ్దాల తర్వాత తోడల్లుళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఒకే వేదికపైకి రాబోతున్నారు. వెంకటేశ్వర రావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ అనే పుస్తక ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా చంద్రబాబు రానున్నారు. గురువారం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. పుస్తక ఆవిష్కరణ కోసం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. అర్ధరాత్రి విశాఖపట్నం చేరుకున్నారు. ఈ కార్యక్రమంకు కేంద్రమంత్రి నిర్మల […]
మూడు దశాబ్దాల తర్వాత తోడల్లుళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఒకే వేదికపైకి రాబోతున్నారు. వెంకటేశ్వర రావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ అనే పుస్తక ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా చంద్రబాబు రానున్నారు. గురువారం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. పుస్తక ఆవిష్కరణ కోసం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. అర్ధరాత్రి విశాఖపట్నం చేరుకున్నారు. ఈ కార్యక్రమంకు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా […]
నేడు 6వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. గురువారం ఉదయం 9 గంటలకు శాసనసభ.. 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ఆరంభం కానున్నాయి. ఉభయ సభలు ప్రశ్నోత్తరాలతో ఆరంభమవుతాయి. ప్రతీరోజూ టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దాంతో శాసనసభ, శాసనమండలి సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఈరోజు కూడా సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ కొనసాగే అవకాశం ఉంది. ఏపీఎస్పీడీసీఎల్ 24వ వార్షిక నివేదిక ప్రతిని, 2013 కంపెనీల చట్టంలోని 395వ సెక్షను […]
ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున సోమవరప్పాడు హైవే చోదిమెళ్ల వద్ద సిమెంటు లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతున్న రమణ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అతి వేగం, […]
నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న అనంతరం సీఎం ఢిల్లీకి వెళ్లనున్నారు. బెజవాడలో నేడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంకు నారా భువనేశ్వరి హాజరుకానున్నారు. సీఐడీ నోటీసుపై స్టే ఇవ్వాలని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది. సినీ నటుడు పోసాని కృష్ణ మురళి క్వాష్ పిటిషన్లు మీద నేడు ఏపీ హైకోర్టు విచారించనుంది. […]
నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తామని చెప్పారని, ఈ ఏడాది కూడా నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రతి మహిళకు సీఎం చంద్రబాబు నాయుడు రూ.36 వేల బాకీ ఉన్నారన్నారు. మహిళలు ఉచిత బస్సు చాలా చిన్న హామీ అని, అది కూడా ఇంతవరకు అమలు చేయలేదని, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత బస్సు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. తల్లికి వందనం అన్నారు.. రూపాయి కూడా ఇంతవరకు […]
‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ అన్నట్లుగా ఉంది: గవర్నర్ ప్రసంగం, బడ్జెట్‌పై మాట్లాడటం కోసం మీడియా సమావేశం ఏర్పాటు చేయటం జరిగిందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్షం వర్షన్ వినిపించే అవకాశం లేకపోవటంతో.. తమ వైపు నుంచి ప్రజలకు వివరించటం కోసమే ఈ సమావేశం అని తెలిపారు. సీఎం చంద్రబాబు వచ్చాక రెండు బడ్జెట్లలో ప్రజలను మోసం చేయటం ప్రస్ఫుటంగా కనిపిస్తుందన్నారు. ఎన్నికల ముందు చెప్పినట్లుగా గాక.. ‘బాబు ష్యూరిటీ.. […]