వచ్చే ఎన్నికలలో చంద్రగిరి నుంచే తాను పోటి చేస్తా అని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి, టీడీపీ మహిళా నేత సుధారెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి చంద్రగిరి రెండు స్దానాలు అవుతాయిని, ఖచ్చితంగా తాను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోటీ చేస్తానన్నారు. అవీనితి చేసిన చెవిరెడ్డి చట్టప్రకారం జైలుకు పోతాడన్నారు. చెవిరెడ్డి, ఆయన సతీమణి ఆస్తుల వివరాలను ఇంటింటికి కరపత్రాలు చేసి పంచుతానని హెచ్చరించారు. చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద చెవిరెడ్డికి సుధారెడ్డి బహిరంగంగా […]
విద్యుత్ ఛార్జీల పెంపు అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. సభ్యుల ప్రశ్నలకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి సమాధానం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచలేదని, పెంచదని స్పష్టం చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు పాపం మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే అని, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారన్నారు. విద్యుత్ ఛార్జీలు వాళ్లే పెంచి, వాళ్లే ధర్నాలు చేసి, వాళ్లే ప్రశ్నలు అడగడం […]
ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే భాధ్యత తమదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయలేదని, 1.82 లక్షల పోస్టులు గత టీడీపీ హయాంలోనే భర్తీ చేశాం అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో రెండోరోజు ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో డీఎస్సీ నోటిఫికేషన్, నిరుద్యోగ భృతిపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానాలు చెప్పారు. […]
తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. సోమవారం రాత్రి తిరుపతి జూ పార్కు రోడ్డులో చిరుత సంచరించింది. ఇవాళ వేకువజామున ఒంటిగంట సమయంలో గాలిగోపురం సమీపంలోని మెట్ల మార్గంలో సంచరించింది. నడక మార్గంలోకి వచ్చి.. పిల్లిని వేటాడి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీ కెమెరా దృశ్యాలను చూసి దుకాణదారులు షాక్ అవుతున్నారు. చిరుత సంచారం సమాచారంపై మెట్ల మార్గం వద్ద దుకాణదారులు ఫారెస్ట్, టీటీడీ విజిలెల్స్‌కు ఫిర్యాదు […]
హాల్ టికెట్ ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో ఓ కాలేజీ యాజమాన్యం ఆటలాడుతోంది. విద్యార్థుల నుంచి ఫీజులు కట్టించుకొని మరీ.. యాజమాన్యం హాల్ టికెట్ ఇవ్వలేదు. పరీక్ష రోజు హాల్ టికెట్ ఇస్తామని చెప్పి.. ఎగ్జామ్ రోజున విద్యార్థులను బస్సులో ఎక్కించుకొని మరలా ఇంటి దగ్గరే దింపారు. ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లా బైరాగిపట్టెడలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి… తిరుపతి జిల్లా బైరాగిపట్టెడలో ఓం ఎస్వీవీ జూనియర్ కాలేజ్ ఉంది. ఇంటర్ ఎగ్జామ్స్ ఉండడంతో.. కాలేజీ […]
దుబాయ్ తమ సొంతగడ్డ కాదు అని, ఇక్కడ భారత్ ఎక్కువ మ్యాచ్‌లేమీ ఆడలేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. దుబాయ్ పిచ్ ప్రతిసారీ భిన్న సవాళ్లను విసురుతోందని, తాము ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కోసారి ఒక్కో రకంగా స్పందించిందన్నాడు. దుబాయ్ మైదానంలో నాలుగు పిచ్‌లు ఉన్నాయని, సెమీ ఫైనల్ దేనిపై ఆడిస్తారో తెలియదని హిట్‌మ్యాన్ చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ ఒకే మైదానంలో ఆడుతోందని, భారీ లాభం పొందుతోందని కొందరు మాజీలు, క్రికెటర్లు అంటున్న […]
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో నాకౌట్ మ్యాచ్‌లకు సమయం ఆసన్నమైంది. మొదటి సెమీస్‌లో టాప్ టీమ్స్ భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. లీగ్ దశలో మూడుకు మూడు మ్యాచ్‌లలో ఘన విజయాలు సాధించిన రోహిత్ సేనకు సెమీస్ అంత ఈజీ కాదు. ఎందుకంటే ఐసీసీ టోర్నీల్లో నాకౌట్లో కంగారూలు రెచ్చిపోతారు. అయితే దుబాయ్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడిన అనుభవం, పిచ్‌కు తగ్గ బలమైన స్పిన్ ఉండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. […]
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సెమీస్ మ్యాచ్ ఆరంభమైంది. మూడు లీగ్ మ్యాచుల్లో ఘన విజయాలు సాధించిన రోహిత్ సేన.. ఆస్ట్రేలియాపై అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. టీమిండియా ఈ మ్యాచులో గెలిచి ఫైనల్ చేరాలని భావిస్తోంది. అంతేకాదు 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవాలని రోహిత్ సేన చూస్తోంది. అయితే స్టార్ ఆటగాళ్ల గైర్హాజరీలో ఆసీస్ కొంత బలహీన పడ్డట్లు కనిపిస్తున్నా.. ఆ జట్టును తక్కువ అంచనా […]
వైసీపీ పాలనలో కాలువలు, డ్రెయిన్స్‌లో తట్ట మట్టి కూడా తీయలేదని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. గత పాలనలో లాకులు, షట్టర్లు, డోర్స్ మరమ్మతులు మాట అటుంచి.. గ్రీజు వంటి మెయింటనేన్స్ కూడా చేయలేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ సరిగా చేయలేదని, ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయినా గత సీఎం కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించారు. ప్రాజెక్టు పనుల నిమిత్తం సీఎం చంద్రబాబు రూ.380 కోట్లు ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించుకున్నా.. […]
ఏపీ శాసనసభలో సభ్యులకు సీట్లను కేటాయించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు సూచనల మేరకు సీట్ల కేటాయింపు జరిగింది. సీనియారిటీ ప్రాతిపదికన శాసనసభలో ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయించారు. సీట్ విషయంలో ఏదైనా సందేహాలుంటే సిబ్బంది సహకారం తీసుకోవచ్చని ఎమ్మెల్యేలకు స్పీకర్ సూచించారు. ట్రెజరీ బెంచ్గా ముందు వరుసలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు సీట్లను కేటాయించారు. అనంతరం చీఫ్ విప్, విప్‌లకు సీట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మాజీ సీఎం, వైసీపీ శాసనసభా పక్షనేత వైఎస్ […]