YS Jagan: ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ అన్నట్లుగా ఉంది!
- బడ్జెట్‌పై వైఎస్ జగన్ మీడియా సమావేశం
- రెండు బడ్జెట్లలోనూ సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారు
- అసెంబ్లీలో ప్రతిపక్షం చెబుతున్న మాటలు వినడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గవర్నర్ ప్రసంగం, బడ్జెట్‌పై మాట్లాడటం కోసం మీడియా సమావేశం ఏర్పాటు చేయటం జరిగిందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్షం వర్షన్ వినిపించే అవకాశం లేకపోవటంతో.. తమ వైపు నుంచి ప్రజలకు వివరించటం కోసమే ఈ సమావేశం అని తెలిపారు. సీఎం చంద్రబాబు వచ్చాక రెండు బడ్జెట్లలో ప్రజలను మోసం చేయటం ప్రస్ఫుటంగా కనిపిస్తుందన్నారు. ఎన్నికల ముందు చెప్పినట్లుగా గాక.. ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ అన్నారని విమర్శించారు. చంద్రబాబు, ఆయన దత్త పుత్రుడు ప్రతీ ఇంటికి కరపత్రాలు కూడా పంచారని జగన్ పేర్కొన్నారు.
‘అన్ని శాఖల కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి. రెండు బడ్జెట్లలో అలాగే ఉన్నాయి. నిరుద్యోగులకు మూడు వేల నిరుద్యోగ భృతి అన్నారు. గత ఏడాది బడ్జెట్లో కూడా దాదాపు 7200 ఇవ్వాల్సిన భృతి ప్రస్తావన లేదు. ఈ ఏడాది కూడా భృతి ప్రస్తావన లేదు. బడ్జెట్లో గవర్నర్ ప్రసంగం తెలుగు కాపీలు అందరికీ పంపిణీ చేశారు. తొమ్మిది నెలల కాలంలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రింట్ చేసి మరీ అందరికీ పంపిణీ చేశారు. ఆ బుక్ లో పచ్చి అబద్ధాలు రాశారు. గవర్నర్ గారి పేరుతో ప్రచురితమైన పుస్తకం.. బడ్జెట్ జరిగేటప్పుడే రెండవ సోషియో ఎకనామిక్ సర్వే అంటూ విడుదల చేశారు. 2024 -25 లో 27,07,752 ఉద్యోగాలు ఇచ్చేశామని రాసేశారు. ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని సీఎం చంద్రబాబు దారుణంగా చెబుతున్నారు’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
‘పిల్లలకు ఇప్పటికే 72 వేల రూపాయలు ఒక్కొక్కరికీ ఇవ్వాలి. దగ, మోసం, వంచన ఇలా అన్నీ చేశారు. ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలు మొత్తం వరుసపెట్టి పీకేస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లో లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించాం. ఆప్కాస్ ద్వారా మరో లక్షా ముప్పై వేల ఉద్యోగాలు, రెండు లక్షల మందికి పైగా వాలంటీర్లు, మా ఐదు సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ ఉద్యోగాలు 6,31,310 ఉద్యోగాలు ఇచ్చాం. మేము చెప్పేది గారడీ లెక్కలు కాదు.. వీళ్ళ ప్రకారమే సోషియో ఎకనామిక్ సర్వేలోని డేటా ఇది. మొత్తంగా మా ఐదేళ్ల పాలనలో 40,13,552 ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆధార్ నంబర్ తో సహా చెప్పగలం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!