శాసనమండలిలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, శాసనమండలి వివక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. గత వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇళ్లు కూడా కట్టలేదని, గతంలో కట్టిన ఇళ్లకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. జగనన్న కాలనీలు అన్నారని, దాని గురించి ఏమీ మాట్లాడాల్సిన పనిలేదని ఎద్దేవా చేశారు. 2014-19 మధ్య ఇళ్లు కట్టిన వారికి తమ ప్రభుత్వ హయంలో బిల్లులు ఇవ్వలేదని మాట్లాడటం అవాస్తవం అని బొత్స ఫైర్ అయ్యారు. […]
గంజాయి సాగును పూర్తి స్థాయిలో అరికడతాం: గంజాయి సాగు 11 వేల ఎకరాల నుంచి 100 ఎకరాలకు వచ్చిందని, ఇంకా పూర్తి స్థాయిలో అరికడతాం అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గంజాయిని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ గంజాయి అరికట్టడంపై దృష్టి పెట్టిందన్నారు. స్కూల్స్, కాలేజీ పిల్లలు గంజాయికి బానిసలు కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని, జిల్లాల వారీగా వర్క్ షాప్స్ జరుగుతున్నాయని హోంమంత్రి తెలిపారు. […]
గంజాయి సాగు 11 వేల ఎకరాల నుంచి 100 ఎకరాలకు వచ్చిందని, ఇంకా పూర్తి స్థాయిలో అరికడతాం అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గంజాయిని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ గంజాయి అరికట్టడంపై దృష్టి పెట్టిందన్నారు. స్కూల్స్, కాలేజీ పిల్లలు గంజాయికి బానిసలు కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని, జిల్లాల వారీగా వర్క్ షాప్స్ జరుగుతున్నాయని హోంమంత్రి తెలిపారు. ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాలలో […]
కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 40 వేల 336 వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేశామన్నారు. ఒక్కో వ్యవసాయ కనెక్షన్‌కు 2 లక్షల 60 వేలు, ఉచిత విద్యుత్‌కు 12 వేల 400 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. గతంలో వేర్వేరు రేట్లకు ట్రాన్సఫార్మర్లు కొనుగోలు చేశారని, ఇక అలా లేకుండా చూస్తామని మంత్రి గొట్టిపాటి చెప్పారు. ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. […]
ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. అనంతరం 2025-26 బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. వివిధ కేటాయింపులు, సంక్షేమానికి నిధులు తదితర అంశాలపై సభలో చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాల నేపథ్యంలో స్కూళ్లలో ప్రహారీ నిర్మాణం, డీఎస్సీపై అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు. మెగా డీఎస్సీల ద్వారా త్వరలో 16,347 పోస్టుల భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో ప్రహారీల నిర్మాణానికి రూ.3వేల కోట్లు అవసరం అవుతుందన్నారు. అన్ని కాలేజీలు, స్కూళ్లలో ‘ఈగల్’ […]
సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పీటీ వారెంట్‌పై నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో పోసానిని నరసరావుపేటకు తీసుకెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు పోసానిని నరసరావుపేట తీసుకువచ్చే అవకాశం ఉంది. నరసరావుపేట పోలీసులకు అప్పగించే ముందు పోసానికి జైలు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. నరసరావుపేట టూ టౌన్ పీఎస్‌లో 153, 504, 67 సెక్షన్ల కింద పోసానిపై కేసు నమోదు చేశారు. అంతకుముందు రాజంపేట సబ్ జైల్ వద్ద ఉత్కంఠ నెలకొంది. గత […]
ప్రారంభమైన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు: తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌ను అధికారులు ఓపెన్ చేశారు. ముందుగా బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టనున్నారు. ఈ ప్రక్రియ దాదాపుగా మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుందని.. అసలు కౌంటింగ్ ప్రక్రియ ఆ తర్వాత మొదలు కానుందని అధికారులు చెప్పారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు సాయంత్రంలోగా వెల్లడి కానున్నాయి. […]
తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌ను అధికారులు ఓపెన్ చేశారు. ముందుగా బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టనున్నారు. ఈ ప్రక్రియ దాదాపుగా మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుందని.. అసలు కౌంటింగ్ ప్రక్రియ ఆ తర్వాత మొదలు కానుందని అధికారులు చెప్పారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు సాయంత్రంలోగా వెల్లడి కానున్నాయి. అయితే పట్టుభద్రుల ఓట్ల లెక్కింపు […]
ఇవాళ ఏపీ అసెంబ్లీలో 2025-26 ఏపీ బడ్జెట్‌పై చర్చ జరగనుంది. వివిధ కేటాయింపులు, సంక్షేమానికి నిధులు లాంటి పూర్తి అంశాలపై చర్చించనున్నారు. మండలిలో బడ్జెట్‌పై చర్చకు సంబంధించి ప్రస్తుతం ఉన్న అప్పులు, సూపర్ సిక్స్ అమలు వంటి వివిధ అంశాలను వైసీపీ సభ్యులు లెవనెత్తె ఆలోచనలో ఉన్నారు. ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ రానున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరి ఫ్లైట్‌లో 5.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి జగన్ […]
చికెన్ మేళాకు అనుహ్య స్పందన: బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ప్రజల్లో అపోహలను తొలగించేందుకు రాజమండ్రిలో చికెన్ మేళాకు అనుహ్య స్పందన లభించింది. చికెన్ వంటకాలను తినడానికి నాన్ వెజ్ ప్రియులు క్యూ కట్టారు. మేళాలో వివిధ రకాల చికెన్ వంటకాలను ఏర్పాటు చేశారు. చికెన్ వంటకాలను ఆరగించడానికి నాన్ వెజ్ ప్రియులు ఎగబడ్డారు. చికెన్ హోల్ సేల్ అండ్ రిటైల్ వర్తక సంఘం ఆధ్వర్యంలో రాజమండ్రి ఆజాద్ చౌక్ సెంటర్లో ఈ చికెన్ మేళాను ఏర్పాటు చేశారు. […]