మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుంది. లీగ్ మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో శనివారం రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్లే ఆఫ్స్, ఫైనల్ చేరే జట్లపై మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 9 మందిలో ఏకంగా ఎనమిది మంది సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మద్దతు తెలిపారు. అడమ్ గిల్ క్రిస్ట్, వీరేంద్ర సెహ్వాగ్, […]
జాతీయ జట్టులోకి రావాలనుకొనే భారత యువ ఆటగాళ్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చక్కటి అవకాశం. ఐపీఎల్లో సత్తా చాటి భారత జట్టులోకి వచ్చిన జాబితా చాలానే ఉంది. సీనియర్లతో పాటు యువ క్రికెటర్లలో కూడా చాలా మంది ఐపీఎల్ ద్వారానే టీమిండియాలోకి వచ్చారు. యువ క్రికెటర్లలో శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌లు ఐపీఎల్ ద్వారానే జట్టులోకి వచ్చారు. కేవలం భారత్‌లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ ఎంతో మందికి జాతీయ […]
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) అంకుర సంస్థ ఎక్స్ఏఐ గ్రోక్ ఏఐ చాట్‌బాట్ సేవల్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల యూజర్లు అడిగిన ప్రశ్నలకు గ్రోక్ ఇస్తున్న ఆసక్తికర సమాధానాలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. స్థానిక భాషలల్లో కూడా సమధానాలు ఇస్తుండటంతో నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. గ్రోక్ కొన్నింటికి కచ్చితమైన సమాధానాలు ఇస్తుండడం విశేషం. తాజాగా ఓ అభిమాని ఐపీఎల్ 2025 విజేత ఎవరు? అని అడగగా.. ఆసక్తికర సమాధానం […]
టీమిండియా పేసర్, హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ సిరాజ్ ఏడేళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు ఆడిన విషయం తెలిసిందే. ఆర్సీబీలో కీలక ఆటగాడిగా ఉన్న సిరాజ్‌ను ఐపీఎల్ 2025 వేలంలో ఆ ప్రాంచైజీ రిటైన్ చేసుకోలేదు. వేలంలో గుజరాత్ టైటాన్స్ అతడిని రూ.12.50 కోట్లకు కొనుగోలు చేసింది. కొన్నేళ్లుగా ఆర్సీబీ జట్టు ఆటగాళ్లతో మంచి అనుబంధం ఉన్న సిరాజ్.. ప్రాంచైజీని వీడటంపై తాజాగా స్పందించాడు. విరాట్ కోహ్లీ తనకు మద్దతుగా నిలిచాడని, ఆర్సీబీని వీడటం తనను […]
ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రులను పీపీపీ మోడ్‌లో నిర్మిస్తాం అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునికీకరణ ప్రక్రియ కొనసాగిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఆస్పత్రుల ఆధునికీకరణకు అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని నిర్మిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అన్ని ఆస్పత్రుల్లో మందుల సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. నందిగామలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం సాధ్యం కాదు అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునికీకరణ అంశంపై […]
కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 27వ తేదీన ఉమ్మడి కడప జిల్లా.. జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపికకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చైర్మన్ ఎన్నికకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు నామినేషన్ల పరిశీలన తర్వాత జాబితాలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. మధ్యాహ్నం జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు. గత జిల్లా […]
ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కేవలం షూటింగ్ చేసి వెళ్లిపోవడం, ఆదాయం తీసుకోవటం కాకుండా.. స్టూడియోల నిర్మాణంపై దృష్టి సారించాలని కోరామన్నారు. విశాఖలో ఇప్పటికిప్పుడు సినీ ఇండస్ట్రీ తీసుకువచ్చే ప్రతిపాదన లేదని.. సినీ నిర్మాతలు, ప్రముఖులతో మాట్లాడి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఏపీలో సినిమాలు తీసేందుకు చాలా లోకేషన్లు ఉన్నాయని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. మండలిలో విశాఖలో సినీ పరిశ్రమపై ప్రశ్నోత్తరాలు జరిగాయి. వీటిపై మంత్రి సమాధానాలు […]
శాసనమండలిలో నూతన పరిశ్రమల స్థాపనపై ప్రశ్నోత్తరాలు జరిగాయి. ‘రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది చెందితేనే పరిశ్రమలు వస్తాయని వైఎస్ జగన్ అనేక సంస్కరణలు తీసుకు వచ్చారు. కొవిడ్ సమయంలో కూడా కొత్త పరిశ్రమలు తీసుకువచ్చారు. రాష్ట్రంలో పేదరికం పోవాలంటే ఉద్యోగ కల్పన జరగాలి. రాబోయే రోజుల్లో మరిన్ని పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేయాలి. పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన వారికి కూడా ఉద్యోగావకాశాలు కల్పించాలి’ అని వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ కోరారు. పీ4 పాలసీలో ఎంతమందిని పారిశ్రామిక వేత్తలుగా […]
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాలు, పోలీస్ వెల్ఫేర్పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సభ్యులు కొణతాల రామకృష్ణ ప్రశ్నించారు. ఇందుకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న 16,862 కానిస్టేబుల్ పోస్టుల్లో 6,100 పోస్టుల నియామకం పూర్తి కానుందని తెలిపారు. మిగిలిన 10,762 ఖాళీల నియామకానికి ప్రభుత్వానికి, డీజీపీ గారికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందని చెప్పారు. అనుమతులు రాగానే మిగిలిన పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలు చేపడతాం అని హోంమంత్రి చెప్పుకొచ్చారు. ‘రాష్ట్రంలో మొత్తం 16,862 […]
ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల నిర్వహణలో పలువురు ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. సభ్యులు ప్రశ్నలు అడిగి సభకు డుమ్మా కొట్టడంపై స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రశ్నలు అడిగిన వారు సభకు రాకపోవడం వలన మరో ఇద్దరు మాట్లాడే అవకాశం కోల్పోతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ రిజిస్టర్లలో సంతకాలు ఉంటునాయి కానీ.. సభలో సదరు సభ్యులు కనిపించడం లేదని స్పీకర్ పేర్కొన్నారు. ప్రజల చేత ఎన్నికై దొంగలా రావడం ఏంటి? అని ఆగ్రహం […]