మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుంది. లీగ్ మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో శనివారం రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్లే ఆఫ్స్, ఫైనల్ చేరే జట్లపై మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 9 మందిలో ఏకంగా ఎనమిది మంది సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మద్దతు తెలిపారు.
అడమ్ గిల్ క్రిస్ట్, వీరేంద్ర సెహ్వాగ్, షాన్ పొల్లాక్, సిమాన్ డౌల్, మైఖేల్ వాన్, మపుమెలెలో ఎంబంగ్వా లాంటి దిగ్గజాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్‌కు చేరుతుందని జోస్యం చెప్పారు. రోహన్ గవాస్కర్, హర్ష బోగ్లే, మనోజ్ తివారీ కూడా సన్‌రైజర్స్‌కే ఓటేశారు. అయితే హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇద్దరు తప్ప.. మరెవరూ కూడా మద్దతుగా నిలవకపోవడం గమనార్హం. రోహన్ గవాస్కర్, హర్ష బోగ్లే మాత్రమే బెంగళూరు టాప్-4లో ఉంటుందని పేర్కొన్నారు. కొందరు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పేర్లను మర్చిపోయారు.
మాజీ క్రికెటర్ల ప్లేఆఫ్స్ ప్రిడక్షన్స్ ఇవే:
# అడమ్ గిల్ క్రిస్ట్ – పంజాబ్, ముంబై, హైదరాబాద్, గుజరాత్
# వీరేంద్ర సెహ్వాగ్ – ముంబై, హైదరాబాద్, పంజాబ్, లక్నో
# షాన్ పొల్లాక్ – ముంబై, చెన్నై, హైదరాబాద్, పంజాబ్
# మైఖేల్ వాన్ – గుజరాత్, ముంబై, కోల్‌కతా, పంజాబ్
# సిమాన్ డౌల్ – చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, పంజాబ్
# ఎంబంగ్వా – హైదరాబాద్, గుజరాత్, కోల్‌కతా, ముంబై
# మనోజ్ తివారీ – హైదరాబాద్, పంజాబ్, గుజరాత్, కోల్‌కతా
# రోహన్ గవాస్కర్ – బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై
# హర్ష బోగ్లే – హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, బెంగళూరు