Bhimavaram Krishna Statue Issue: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సినీ నటుడు, తెలుగు చిత్రసీమకు ఎనలేని సేవ చేసిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది. భీమవరం పట్టణంలోని ఎడ్వర్డ్ ట్యాంక్ వద్ద గత 12-04-2024 తేదీన కృష్ణ అభిమానులు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే విగ్రహం ఏర్పాటుకు సంబంధించి మున్సిపల్ అధికారులు అనుమతులు ఇచ్చినప్పటికీ, అదే అధికారులు ఇప్పుడు దానిని అనధికార విగ్రహంగా పేర్కొంటూ తొలగించేందుకు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
READ ALSO: Physically Abuse: ట్రైన్లో మహిళపై అత్యాచారం.. ఆర్మీ జవాన్ అరెస్టు
తాజాగా మున్సిపల్ అధికారులు కృష్ణ అభిమానులకు 24 గంటల్లో విగ్రహాన్ని తొలగించాలి అంటూ నోటీసులు జారీ చేశారు. దీంతో సూపర్ స్టార్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా అనుమతులు తీసుకొని విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, అదే అధికారులు ఇప్పుడు నిబంధనల పేరుతో తొలగించేందుకు ప్రయత్నించడం అన్యాయమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణ విగ్రహం తొలగింపునకు వ్యతిరేకంగా భీమవరంలో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ నిరసనకు అన్ని సినీ హీరోల సంఘాల నాయకులు హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అభిమాన సంఘం నాయకులు మాట్లాడుతూ.. సూపర్ స్టార్ కృష్ణకు ఉన్న అభిమాన గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని విగ్రహాన్ని తొలగించకూడదని డిమాండ్ చేశారు. విగ్రహం ప్రజాభావోద్వేగాలతో ముడిపడి ఉందని, దీనిని తొలగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
మున్సిపల్ అధికారుల చర్యలకు వ్యతిరేకంగా కృష్ణ అభిమాన సంఘం నాయకుడు రాయప్రోలు శ్రీనివాసమూర్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. విగ్రహం ఏర్పాటు చట్టబద్ధమేనని, అధికారులే అనుమతి ఇచ్చి, ఇప్పుడు మళ్లీ తొలగించేందుకు ప్రయత్నించడం చట్ట విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విగ్రహం తొలగింపుపై స్టే ఉత్తర్వులు మంజూరు చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విగ్రహాన్ని తొలగించకూడదని ఈ ఉత్తర్వులలో స్పష్టం చేసింది. హైకోర్టు నిర్ణయంతో కృష్ణ అభిమానులు ఊరట పొందారు. హైకోర్టు తదుపరి విచారణలో తీసుకునే నిర్ణయంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది.
READ ALSO: Andhra King Thaluka OTT Release: ఓటీటీలోకి ‘ఆంధ్ర కింగ్ తాలూకా’… స్ట్రీమింగ్ ఏ రోజున అంటే!