ఆహార పదార్థాల్ని కల్తీ చేసే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ చట్టాల మేరకు రాష్ట్రంలో ఆహార కల్తీని నిరోధించటానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. శాసనసభలో సభ్యులు ఆహార కల్తీపై సంధించిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. మానవ వినియోగానికి సంబంధించిన ఆహార వస్తువుల అమ్మకం, నిల్వ, పంపిణీ దిగుమతుల వంటివాటి నియంత్రణ, పర్యవేక్షణకు సంబంధించి 2006 నాటి ఆహార భద్రత, ప్రమాణాల చట్ట […]
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. వైసీపీ పార్టీ, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. మర్రి రాజశేఖర్ తన రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఇప్పటి వరకు నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీని వీడారు. ఈ జాబితాలో జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ ఉన్నారు. తాజాగా మర్రి రాజశేఖర్ రాజీనామాతో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ ఆవిర్భావం […]
అనకాపల్లి జిల్లాలో కలకలం సృష్టించిన మహిళ శరీర భాగాలు లభ్యం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. తల ఒకచోట.. మొండెం, కాళ్లు, చేతులు మరో చోట లభించాయి. హత్యకు గురైంది దీప అనే ట్రాన్స్ జెండర్‌గా గుర్తించారు పోలీసులు. మొత్తం 8 పోలీసు బృందాలు నిందితుల కోసం, మిగతా శరీర భాగాల కోసం గాలించగా.. ఈరోజు ఉదయం అనకాపల్లి వై జంక్షన్ సమీపంలో మిగతా శరీర భాగాలను గుర్తించారు. వై జంక్షన్ సమీపంలో తల, మరో చెయ్యి […]
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలోని కొన్ని పూతరేకుల దుకాణాల్లో వాడింది కల్తీ నెయ్యేనని నిర్ధారణ అయింది. హైదరాబాద్‌కు పంపిన శాంపిల్స్ ల్యాబ్ పరిశీలనలో వాస్తవాలు వెల్లడయ్యాయి. దాంతో ఆత్రేయపురంలోని కొన్ని పూతరేకుల దుకాణాల్లో నాణ్యతలేని వెయ్యి వాడుతున్నట్లు తేలిపోయింది. గత నెల ఆహార భద్రత అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో లూజు నెయ్యి ప్యాకెట్లు, బ్రాండ్ లేని నెయ్యి నమూనాలను గుర్తించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అర్జించాలన్న అత్యాశలతో కొందరు నాణ్యత లేని నెయ్యి వాడుతున్నట్లు […]
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా రెండో రోజు వరుస భేటీలతో సీఎం బిజీ బిజీగా గడపనున్నారు. ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు ఈరోజు సమావేశం కానున్నారు. ఏపీకి గేట్స్ ఫౌండేషన్ సహకారంపై బిల్ గేట్స్‌తో సీఎం సుదీర్ఘంగా చర్చించనున్నారు. గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులుగా బిల్ గేట్స్ ఉన్నారు. ఏపీకి వివిధ రంగాల్లో సహాయ సహకారాలు […]
నేడు 14వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. క్వశ్చన్ అవర్‌తో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మహిళలకు ఆర్ధిక సాయం, కృష్ణపట్నం ఓడరేవు నుంచి ఎగుమతి అండ్ దిగుమతి, పశు వైద్యశాలలపై సభ్యుల ప్రశ్నలు అడగనున్నారు. విశాఖ రైతులకు భూ కేటాయింపు, దొనకొండలో పారిశ్రామికవాడ, గుంటూరు మిర్చి యార్డులో అక్రమాలపై ప్రశ్నలు సందించనున్నారు. ఇవాళ సభలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రెవెన్యు సమస్యలపై ప్రత్యేక చర్చ జరగనుంది. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనమండలి […]
నేడు ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పలువురు కేంద్రమంత్రులతో సీఎం భేటీ కానున్నారు. ఇవాళ 14వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. క్వశ్చన్ అవర్‌తో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు సీఐడీ కోర్టులో విచారణ జరగనుంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ పిటిషన్ వేశారు. గన్నవరంలో నేడు మంత్రి […]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్‌ను శాసన సభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సీఎం అరకు కాఫీని స్పీకర్, డిప్యూటీ సీఎంలకు స్వయంగా అందించారు. అనంతరం స్టాల్ వద్ద అరకు కాఫీ బాక్సులను సబ్యులకు అందజేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఇక నుంచి అరకు కాఫీ అందుబాటులోకి రానుంది. అరకు కాఫీకి ప్రచారం కల్పించాలని ఏపీ ప్రభుత్వం […]
ఏపీ శాసనమండలిలో పెన్షన్లపై వైసీపీ సభ్యులు ప్రశ్నలు సంధించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యే సమయానికి 53 లక్షల మందికి పెన్షన్లు ఉన్నాయని, కూటమి అధికారంలోకి వచ్చే సమయానికి 65 లక్షలకు పెన్షన్లు పెరిగాయని వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పేర్కొన్నారు. ఇప్పుడు పెన్షన్లు ఎన్ని తొలగించారని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చాక 1.89 లక్షల మందికి తగ్గించారని, బడ్జెట్లో ఉన్న పెన్షన్లకి సరిపడా కేటాయింపులు చేయలేదని వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయేల్ ఫైర్ అయ్యారు. వైసీపీ సభ్యుల […]
కేర్ హాస్పిటల్స్ సంచలనం: అత్యాధునిక కార్డియాక్ కేర్‌తో క్రిటికల్‌గా ఉన్న రోగికి కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ విజయవంతంగా చికిత్స చేసి ప్రాణాలను రక్షించింది. హైదరాబాద్‌లో గుండె పోటుతో బాధపడుతున్న 68 ఏళ్ల శ్రీమతి సుభాషిణి (పేరు మార్పు)కు విజయవంతంగా చికిత్స చేసి ప్రాణాలను కాపాడారు. అత్యంత క్లిష్టమైన ఈ కేసు, అధునాతన కార్డియాక్ కేర్, వినూత్నమైన సాంకేతికతలు, మరియు మల్టీడిసిప్లినరీ విధానంతో ఎలా ప్రాణాలను రక్షించగలమో నిరూపించింది. రుమటాయిడ్ ఆర్థ్రిటిస్, ఇంటర్‌స్టిషియల్ లంగ్ డిసీజ్, కాలేజెన్ […]