Sampath Kumar
Author- NTV Telugu-
The RajaSaab-Maruthi: ఆ పాత్ర ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది.. ‘ది రాజాసాబ్’పై అంచనాలు పెంచుతున్న మారుతి!
2026 సంక్రాంతి రిలీజ్ బరిలో ఉన్న సినిమాలలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ ఒకటి. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ హారర్ కామెడీ చిత్రం విడుదల కానుంది. రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో.. డైరెక్టర్ మారుతి ప్రచారంలో బిజీగా ఉన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం మారుతి ఇంటర్వ్యూలు ఇస్తూ.. రాజాసాబ్ సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకుంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో బొమన్ ఇరానీ పాత్ర గురించి చెప్పి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచారు. ‘రాజాసాబ్ సినిమాలో […] -
IND vs BAN Schedule: బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా.. కొత్త షెడ్యూల్ రిలీజ్!
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతుండగా.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) శుక్రవారం భారత్‌తో సిరీస్ కోసం కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. బీసీబీ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 1, 3, 6 తేదీల్లో వన్డేలు.. సెప్టెంబర్ 9, 12, 13 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత జట్టు ఆగస్టు 28న బంగ్లాదేశ్ చేరుకుంటుంది. ప్రస్తుత పరిస్థితి, బంగ్లాదేశ్‌లో స్థిరమైన ప్రభుత్వం లేకపోవడంతో.. బీసీసీఐ ఈ పర్యటనకు అంగీకరిస్తుందో లేదో చూడాలి. […] -
Ranveer Singh: దీపిక కంటే ముందు.. సందీప్ రెడ్డి వంగా ఆఫర్‌ను తిరస్కరించిన రణవీర్ సింగ్!
2023లో వచ్చిన ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ తర్వాత రణవీర్ సింగ్ ఖాతాలో పెద్ద హిట్ లేదు. ఆ లోటును ‘ధురంధర్’తో తీర్చుకోవడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద ఘనంగా పునరాగమనం చేశాడు. ధురంధర్ అన్ని బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్లు వసూల్ చేసి.. పరుగులు పెడుతోంది. ధురంధర్ మేనియా మధ్య స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. […] -
Ranveer Singh-Dhurandhar: ‘ధురంధర్’ తుఫాను మధ్య.. రణవీర్ రొమాంటిక్ కామెడీ మూవీ వచ్చేస్తోంది!
బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ చిత్రం ‘ధురంధర్’ 2025 డిసెంబర్ 5న విడుదలైంది. సినిమా రిలీజై దాదాపు నెల రోజులు కావొస్తున్నా.. ధురంధర్ మేనియా కంటిన్యూ అవుతోంది. నాల్గవ వారంలో భారీ వసూళ్లను కలెక్ట్ చేసింది. ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు వసూళ్లను దాటింది. ఈ మూవీ సీక్వెల్ మార్చి 19న రిలీజ్ కాబోతోంది. అయితే బాలీవుడ్లో ధురంధర్ తుఫాను మధ్య రణవీర్ నటించిన ఓ రొమాంటిక్ కామెడీ సినిమా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. […] -
Realme 16 Pro 5G Launch: రియల్మీ ‘బాహుబలి’ ఫోన్ వచ్చేస్తోంది.. 2 రోజుల పాటు ఛార్జర్ అవసరం లేదు!
చైనాకు చేసిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘రియల్మీ’ జనవరి 6న భారతదేశంలో రియల్మీ 16 ప్రో 5G సిరీస్‌ను విడుదల చేయనుంది. ఈ శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌తో పాటు రియల్మీ ప్యాడ్ 3 5Gని కూడా విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. 16 ప్రో 5G ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్, రియల్మీ ఇండియా ఆన్లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ‘అర్బన్ వైల్డ్’ డిజైన్ ఫోన్‌కు ప్రీమియం అండ్ స్టైలిష్ లుక్ ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు […] -
Pooja Hegde: సక్సెస్ టేస్ట్ మర్చిపోయిన పూజా హెగ్డే.. బుట్టబొమ్మను ఆదుకోవాల్సింది ఆ హీరోయేనా?
‘అల వైకుంఠపురం’తో బుట్టబొమ్మను పూజా హెగ్డే సర్ నేమ్‌గా మార్చేసుకున్నారు. అయితే ఆ పేరుకు ఉన్న క్రేజ్ మాత్రం నిలబెట్టుకోవడంలో ఫెయిలయ్యారు. అల వైకుంఠపురం సినిమా తర్వాత తెలుగులో ఒక్క హిట్ లేదు. ‘గుంటూరు కారం’ మిస్ చేసుకొని ఉండకపోతే హిట్ చూసేదే కానీ.. సక్సెస్ క్రెడిట్ శ్రీలీల ఖాతాలోకి చేరిపోయింది. టాలీవుడ్లో కలిసి రావడం లేదని బీటౌన్లోకి ఎంట్రీ ఇస్తే.. అక్కడ కూడా డిజాస్టర్స్ పలకరించాయి. దాంతో పూజా కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టారు. ‘దళపతి’ విజయ్ […] -
Bhartha Mahasayulaku Wignyapthi: వామ్మో వాయ్యో.. ఇద్దరు హాట్ భామలతో రవితేజ రొమాన్స్!
మాస్ మహారాజా ‘రవితేజ’ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ చిత్రానికి కిశోర్ తిరుమల దర్శకత్వం వహించగా.. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. రవితేజ సరసన హాట్ భామలు డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 13న రిలీజ్ కానుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రచారంలో వేగం పెంచింది. ఈ క్రమంలో ఓ సాంగ్‌ను […] -
Priya Bhavani Shankar: మళ్లీ బిజీగా ప్రియ భవానీ శంకర్.. చేతిలో త్రీ క్రేజీ ప్రాజెక్ట్స్, తెలుగులో మూవీ!
యాంకర్ నుండి హీరోయిన్గా మేకోవరైన కోలీవుడ్ నటి ‘ప్రియ భవానీ శంకర్’. సొంత ఇంట్లో ఫ్రూవ్ చేసుకోగలింది కానీ.. టాలీవుడ్లో మాత్రం ఆమెను బ్యాడ్ లక్ వెంటాడుతూనే ఉంది. సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ‘కళ్యాణం కమనీయం’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియా.. ఇక్కడ చేసినవన్నీ ఫ్లాప్సే. 2024లో వచ్చిన భీమా కూడా హిట్ ఇవ్వలేకపోయింది. అయినా కూడా ప్రియ టాలీవుడ్ మరో అవకాశాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ హీరో ‘రవితేజ’ సరసన నటిస్తున్నట్లు సమాచారం. Also […] -
200MP కెమెరా, 6500mAh బ్యాటరీ.. ప్రత్యేక ఆకర్షణగా Oppo Reno 15 Pro Mini!
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘ఒప్పో’ తన రెనో 15 సిరీస్‌ను భారత్‌లో జనవరి 8న లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో Oppo Reno 15, Oppo Reno 15 Pro, Oppo Reno 15 Pro Mini మోడళ్లను లాంచ్ చేయనుంది. రెనో సిరీస్‌లో తొలిసారిగా చిన్న సైజ్‌లో వచ్చే ప్రో మినీ వేరియంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఒప్పో రెనో 15 స్టాండర్డ్ వేరియంట్లో 50MP ప్రైమరీ కెమెరాను అందించనుండగా.. […] -
AUS vs ENG 5th Test: ఇంగ్లండ్ మాస్టర్ ప్లాన్.. 277 వికెట్లు తీసిన బౌలర్ అరంగేట్రం!
2025-26 యాషెస్ సిరీస్‌లో ఐదవ టెస్ట్ జనవరి 4-8 మధ్య సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతుంది. ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న ఆతిథ్య ఆస్ట్రేలియా.. ఇప్పటికే తన ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. చివరి టెస్ట్ కోసం ఇంగ్లండ్ 12 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. జట్టులో రెండు మార్పులు చేయబడ్డాయి. ఫాస్ట్ బౌలర్ మాథ్యూ పాట్స్, స్పిన్నర్ షోయబ్ బషీర్ జట్టులోకి వచ్చారు. గస్ అట్కిన్సన్ను జట్టు నుంచి తొలగించారు. ఇంగ్లండ్ సిరీస్‌లో 3-1 తేడాతో వెనుకబడి […]
తాజావార్తలు
-
UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
-
Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
-
Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
-
Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
Asia Cup Trophies: బీసీసీఐ కీలక అప్డేట్.. త్వరలో భారత్‌కు ఆసియా కప్ ట్రోఫీలు!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!