‘సూపర్ స్టార్’ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్ఎస్ రాజామౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ 29 చేస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. కొన్ని కీలక షెడ్యూల్స్ పూర్తి చేశాడు జక్కన్న. కానీ ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది?, అసలు షూటింగ్ ఎంతవరకు వచ్చింది? అనే విషయంలో అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. కానీ మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 30 ఎవరితో చేయబోతున్నాడనే చర్చ మాత్రం జరుగుతోంది. ఎస్ఎస్ఎంబీ 29 […]
‘అవతార్’ సినిమా గురించి అందరికీ తెలిసిందే. దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ సినిమా.. ఆడియెన్స్‌ను ఒక అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్లింది. యావత్ సినీ ప్రపంచం అవతార్ సినిమాకు పిదా అయిపోయింది. అవతార్ ఫ్రాంచైజీలో ఇప్పటికే రెండు చిత్రాలు విడుదలవగా.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు అవతార్ 3కి రంగం సిద్ధమవుతతోంది. ఈసారి.. ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ టైటిల్‌తో రాబోతోంది. మొదటి రెండు చిత్రాలకు మించి పార్ట్ 3 ఉంటుందని […]
వచ్చే నెలలో ఇంగ్లండ్, భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. ఇంగ్లండ్ పర్యటన కోసం భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ప్రకటించనుంది. సీనియర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. జట్టులో యువకులకు అవకాశం దక్కనుంది. భారత్-ఏ తరఫున ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తున్న వారిలో కూడా టీమిండియాలో చోటు దక్కే అవకాశాలు లేకపోలేదు. అయితే కీలక టెస్ట్ సిరీస్ ముందు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓ […]
బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా తన కో-ఓనర్ (సహ యజమానుల)లపై కోర్టులో కేసు వేశారు. నిబంధనలకు విరుద్ధంగా సమావేశం నిర్వహించారంటూ.. పంజాబ్ డైరెక్టర్లు మోహిత్ బుర్మాన్, నెస్ వాడియాపై చండీగఢ్ కోర్టులో పిటిషన్ వేశారు. నెస్ వాడియా మద్దతుతో మోహిత్ బర్మాన్ సమావేశాన్ని నిర్వహించారని ఆరోపించారు. డైరెక్టర్‌గా మునీశ్ ఖన్నా నియామకాన్ని వెంటనే నిలిపివేయాలని ప్రీతి తన పిటిషన్లో కోర్టును కోరారు. ఈ వ్యవహారంతో పంజాబ్ కింగ్స్ జట్టులోని లుకలుకలు బయటపడ్డాయి. […]
గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్. వరుసగా రెండు రోజులు భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు కాస్త తగ్గాయి. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 తగ్గితే.. 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.350 తగ్గింది. బులియన్ మార్కెట్లో శుక్రవారం (మే 23) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,400గా.. 24 క్యారెట్ల ధర రూ.97,530గా నమోదైంది. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుందన్న విషయం తెలిసిందే. […]
2022లో రిలీజైన ‘కాంతార’ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కాంతార.. ఏకంగా రూ.400 పైగా కోట్లు వసూళ్లు చేసింది. స్వీయ దర్శకత్వంలో రిషబ్ శెట్టి హీరోగా నటించగా.. సప్తమి గౌడ కథానాయిక. కాంతారకు సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు. చాన్నాళ్ల నుంచి షూటింగ్ కూడా జరుగుతోంది. అయితే ఈ సినిమా వాయిదా పడనుందంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై చిత్రబృందం […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారు అయ్యాయి. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లాయి. ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్‌లలో ఎనిమిదింట్లో విజయం సాధించిన ఆర్సీబీ.. 17 పాయింట్లతో ప్రస్తుతం పట్టికలో రెండో స్థానంలో ఉంది. లీగ్ దశలో ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండడంతో ఆర్సీబీకి టాప్ 2లో కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) […]
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్‌కు ముంబై ఇండియన్స్ దూసుకెళ్లిన విషయం తెలిసిందే. లీగ్ ఆరంభంలో వరుస పరాజయాలతో పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబై.. ఆపై వరుస విషయాలతో లీగ్ దశలో మరో మ్యాచ్ ఉండగానే ప్లేఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. ఇక టాప్ 2 స్థానం కోసం పోటీ పడుతోంది. ఓ దశలో లీగ్ స్టేజ్ నుంచే ఇంటిదారి పట్టేలా కనిపించిన ముంబై.. అనూహ్యంగా రేసులోకి రావడానికి కారణం స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన […]
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి అయ్యారు. కిరణ్ సతీమణి, నటి రహస్య గోరక్ గురువారం పండండి బాబుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని కిరణ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తనకు కుమారుడు పుట్టాడని, అందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అంటూ బాబు కాలిని ముద్దాడుతున్న ఫొటో షేర్ చేశారు. అభిమానులు, సినీ ప్రముఖులు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2019లో విడుదలైన ‘రాజావారు రాణిగారు’ సినిమాలో కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ నటించిన విషయం […]
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు నుంచి లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) నిష్క్రమించిన విషయం తెలిసిందే. 13 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించి 12 పాయింట్లతో పట్టికలో 7వ స్థానంలో ఉంది. ఆరంభంలో మంచి విజయాలు సాధించిన లక్నో.. సీజన్ మధ్యలో వరుస ఓటములతో మూల్యం చెల్లించుకుంది. లీగ్ దశలో మిగిలిన మ్యాచ్ గెలిస్తే.. పట్టికలో కాస్త పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎల్ఎస్జీ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోవడానికి కారణం రిషభ్ పంత్ అనే […]