భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏవియేషన్ హబ్ నిర్మాణంలో భాగంగా సిటీ సైడ్ డెవలప్మెంట్ కోసం 500 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. జీవీఐఎఎల్ సంస్థకు 500 ఎకరాల భూ కేటాయింపునకు రెండు రోజుల క్రితం రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రుల కమిటీ సిఫార్సుల మేరకు భోగాపురం విమానాశ్రయానికి ఈ భూ కేటాయింపునకు ఆమోదం తెలిపింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం.. ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి కోసం 1733 ఎకరాలు, జాతీయ రహదారి నుంచి విమానాశ్రయ అనుసంధానం కోసం 92 ఎకరాలను ప్రతిపాదించారు.
Also Read: Payyavula Keshav: వైఎస్ జగన్.. అప్పుడు స్కాం కనిపించలేదా?
భోగాపురం విమానాశ్రయంలో కార్గో ఏరియా కోసం 83.5 ఎకరాలు, నార్త్ టెర్మినల్ భవనం కోసం 98 ఎకరాలు, ఎయిర్‌పోర్ట్ బౌండరీ కోసం 494 ఎకరాలు మేర ప్రతిపాదన ప్రతిపాదన చేశారు. నివాస ప్రాంతం, ఇతర అవసరాల కోసం 201 ఎకరాల కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏటా 36 మిలియన్ల మంది ప్రయాణికుల రాకపోకలకు వీలుగా మూడు దశల్లో భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ప్లాన్ ప్రకారం 2703 ఎకరాల్ని కేటాయించాల్సి ఉన్నా.. 2203 ఎకరాలను మాత్రమే విమానాశ్రయానికి వైసీపీ ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం ప్రాజెక్టు వయబిలిటితో పాటు భవిష్యత్ అవసరాలు, సిటీ సైడ్ డెవలప్మెంట్ కోసం 500 ఎకరాలను కేటాయిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.