Krishna District: యువతితో అసభ్య నృత్యాలు.. హోంగార్డు సస్పెండ్!
- యువతితో హోంగార్డు అసభ్య నృత్యాలు
- హోంగార్డుపై క్రమశిక్షణ చర్యలు
- విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంతే అంటున్న ఎస్పీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసభ్య ప్రవర్తన కలిగిన హోంగార్డును కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విధుల నుంచి తప్పించారు. హోంగార్డు 304 బీ.అజయ్ కుమార్ అసభ్య నృత్యాలు చేస్తూ అనుచిత ప్రవర్తన కలిగి పోలీస్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడంతో.. సదరు హోంగార్డుపై క్రమశిక్షణ చర్యలకు జిల్లా ఎస్పీ ఉపక్రమించారు. ప్రజారక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ విధుల్లో పాల్గొనవలసిన హోంగార్డ్ అసభ్య నృత్యాలు చేస్తూ ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల వేదికగా విస్తృతంగా వ్యాపించడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. వాటిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించవలసిందిగా ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Kolusu Partha Sarathy: 5 లక్షల ఇళ్లులు ఉగాదికి పంపిణీ చేస్తాం!
Also Read
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
వీడియోల ద్వారా ప్రచురితమవుతున్న వార్త నిజ నిర్ధారణ కావడంతో ఈరోజు హోంగార్డు అజయ్ కుమార్‌ను విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి పోలీస్ సిబ్బంది, అధికారుల ప్రవర్తన పోలీస్ శాఖ యొక్క ప్రతిష్టను పెంచేలా ఉంచాలి గానీ అప్రతిష్టకు గురి చేసేలా ఎవరు వ్యవహరించినా వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడేది లేదని ఎస్పీ హెచ్చరించారు. మంచి విధి నిర్వహణ కనపరిస్తే ఏ విధంగా అభినందిస్తామో, అలాగే విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంతే కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ హెచ్చరించారు.
తాజావార్తలు
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!