అమరావతి ఆర్థిక పురోగతికి పునాది పడిన రోజు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో ఇదొక బృహత్తర కార్యక్రమం అని పేర్కొన్నారు. రాష్ట్ర పురోగతి కోసం ప్రతి అడుగు అభివృద్ధికి ప్రధాని మోడీ అందిస్తున్న సహాయ సహకారాలు మర్చిపోలేనిదన్నారు. కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సహాయం కాగితాల్లో కరిగిపోకుండా.. జవాబుదారితనం, మంచి సారథ్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. అమరావతి ఆర్థిక కేంద్రంగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో […]
వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో ఈ ఏడాది మే 24న టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావులు దారుణ హత్యకు గురయ్యారు. ఈకేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ నేతల హత్య కేసులో తమకు సంబంధం లేదని ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ముందస్తు […]
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాల ఈ-డిప్‌కు రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు నమోదవుతున్నాయి. 24 గంటల్లో ఈ-డిప్‌కు 6 లక్షల రిజిస్ట్రేషన్లు వచ్చాయి. 1+3 విధానంలో మొత్తం 15.50 లక్షల మంది భక్తుల పేర్లు నమోదుచేసుకున్నారు. డిసెంబర్ 1వ తేది వరకు ఈ-డిప్ రిజిస్ట్రేషన్లు కొనసాగనున్నాయి. 60 నుంచి 70 లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసుకుంటారని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. Also Read: WPL 2026 Auction: వేలంలో అత్యధిక ధర […]
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 మెగా వేలం ముగిసిన విషయం తెలిసిందే. సీజన్ సీజన్‌కూ పాపులర్ అవుతున్న డబ్ల్యూపీఎల్‌లో క్రికెటర్ల వేలం ధర కూడా పైపైకి వెళ్తోంది. తాజా వేలంలో 2025 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులోని సభ్యులపై కాసుల వర్షం కురిసింది. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ లీగ్ వేలం చరిత్రలోనే అత్యధిక ధర పలికింది. యూపీ వారియర్సే ఆమెను రూ.3.2 కోట్లకు కైవసం చేసుకుంది. దాంతో దీప్తి ఈ వేలంలో అత్యంత ఖరీదైన […]
నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ‘దిత్వా’ తుపాన్ ఏర్పడింది. ప్రస్తుతానికి ఇది ట్రింకోమలీ (శ్రీలంక)కి 80 కి.మీ, పుదుచ్చేరికి 480 కి.మీ, చెన్నైకి 580 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో 8 కి.మీ వేగంతో తుపాన్ కదిలింది. ఎల్లుండికి నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. దిత్వా తుపాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు […]
అనంతపురం నగరంలోని శారద నగర్లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా రామగిరి డిప్యూటీ తాహసీల్దార్ భార్య, కుమారుడు ఇద్దరు మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. మూడున్నర ఏళ్ల బాలుడు సహర్షను తల్లి అమూల్య గొంతు కోసి చంపింది. కుమారుడిని హత్య చేశాక ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అనంతపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసున్నారు. Also Read: AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక […]
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితులుగా ఉన్న ఏ2 వాసుదేవ రెడ్డి, ఏ3 సత్యప్రసాద్‌లు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో ఏసీబీ కోర్టులో ఈ ఇద్దరు ముందస్తు బెయిల్ పిటిషన్లు వేయగా.. కోర్టు డిస్మిస్ చేయటంతో హైకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో ఈ ఇద్దరికి ముందస్తు బెయిల్ ఇవ్వద్దని కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. […]
సింహ రాశి వారికి ఈరోజు కలిసిరానుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. దూర ప్రాంతాల నుంచి కొన్ని శుభవార్తలు అందుతుంటాయి. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు సింహ రాశి వారికి కలిసొచ్చే దైవం శ్రీ పాండురంగ స్వామి వారు. నామ రామాయణంను పారాయణం చేస్తే మంచిది. ఈ కింది వీడియోలో మిగతా రాశుల వారి సైనా ఫలాలు ఉన్నాయి. శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు మీకు […]
ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఏపీ సచివాలయంలో అమరావతి రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. సచివాలయం ఐదో బ్లాక్‌లోని కాన్ఫెరెన్స్ హాల్లో వంద మంది రైతులతో సీఎం సమావేశమవ్వనున్నారు. రైతులకు సంబంధించిన వివిధ అంశాలపై చంద్రబాబు చర్చించనున్నారు. రైతుల సమావేశంలో సమస్యల పరిష్కారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైతులకు ప్లాట్లు కేటాయింపు, జరీబు-మెట్ట భూములు, ఎసైన్డ్ భూములకు సంబంధించి చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు […]
ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ‘మోటోరొలా’ మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘మోటో జీ57 పవర్’ 5జీ పేరిట భారతదేశంలో లాంచ్ చేసింది. రూ.15 వేల లోపు బడ్జెట్లో ఈ ఫోన్‌ను తీసుకురావడం ప్రత్యేకం. ఈ ఫోన్ ప్రత్యేకంగా పవర్ యూజర్లు, దీర్ఘకాలిక గేమర్ల కోసం రూపొందించబడింది. మోటో జీ57 పవర్లో హైలైట్ ఏంటంటే.. 7000mAh బ్యాటరీ ఉండడం. ఇంత తక్కువ బడ్జెట్ ఫోన్లో కంపెనీ బిగ్ బ్యాటరీని ఇవ్వడం విశేషం. మోటో […]