టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (29), సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ (30)ల వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. నవంబర్ 23న మహారాష్ట్రలోని సాంగ్లిలో జరగాల్సిన పెళ్లి.. మంధాన తండ్రి శ్రీనివాస్ అనారోగ్యం కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. ఈ విషయాన్ని ఇరు కుటుంబాలు సోషల్ మీడియాలో ప్రకటించాయి. శ్రీనివాస్ గుండెపోటు లక్షణాలతో ఆస్పత్రిలో చేరారని పలాశ్, మంధాన కుటుంబాలు పేర్కొన్నాయి. అయితే తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటికోచ్చింది. మంధానని పలాశ్ మోసం చేశాడని కొన్ని స్క్రీన్‌షాట్‌లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పలాశ్ ముచ్చల్, ఓ మహిళ మధ్య జరిగిన చాట్‌లకు సంబందించిన స్క్రీన్‌షాట్‌లు సోషల్ మీడియాలో మంగళవారం వైరల్ అయ్యాయి. కొరిగ్రాఫర్ మేరీ డికోస్టా స్క్రీన్‌షాట్‌లను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తరువాత రెడ్డిట్‌లో షేర్ చేయబడ్డాయి. పలాశ్ తనతో చాట్ చేసినట్లుగా ఆ స్క్రీన్‌షాట్‌ల సారాంశం. 2025 మేలో ఆ మహిళను పలాశ్ ఈతకు ఆహ్వానించినట్లు స్క్రీన్‌షాట్‌లలో ఉంది. స్మృతి మంధానతో తన బంధం పాతబడిందని.. తనతో డేటింగ్‌కు రావాల్సిందిగా ఆ మహిళను పలాశ్ కోరాడు. అంతేకాదు మంధాన గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేసినట్లు సమాచారం. ఈ చాట్ విషయం పెళ్లికి కొద్ది గంటల ముందే తెలియడంతో మంధాన తీవ్ర ఆవేదనకు గురైందట. ఉన్న పళంగా పెళ్లిని వాయిదా వేసిందట.
స్క్రీన్‌షాట్‌ల గురించి స్మృతి మంధాన తండ్రి పలాశ్ ముచ్చల్‌ను నిలదీయడంతో గొడవకు దారి తీసిందని, అప్పుడే ఆయనకు గుండెపోటు వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. పెళ్లి వాయిదా అనంతరం పలాశ్ కూడా ఆసుపత్రిలో చేరాడు. మరోవైపు మంధాన తన నిశ్చితార్థ ఫోటోలు, ప్రపోజల్ వీడియోతో సహా అనేక పోస్ట్‌లను ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించింది. దాంతో స్క్రీన్‌షాట్‌ల వ్యవహారం నిజమే అని నెటిజెన్స్ అంటున్నారు. అసలు విషయం తెలియాలంటే మంధాన స్వయంగా స్పందించాల్సిందే. ఇక మంధాన, పలాశ్ 2019 నుంచి డేటింగ్‌లో ఉన్నారు.