తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 27న ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు జారీ చేయనున్నారు. నోటిఫికేషన్ విడుదల నుంచి పోలింగ్‌కు పదిహేను రోజుల సమయం ఉంది. డిసెంబర్ 11న మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.
Also Read: Krishna District: యువతితో అసభ్య నృత్యాలు.. హోంగార్డు సస్పెండ్!
మొదటి విడత అనంతరం నాలుగు రోజుల తేడాతో రెండు, మూడు దశల ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ కసరత్తులు చేస్తోంది. డిసెంబర్ 15, డిసెంబర్ 19వ తేదీల్లో రెండు, మూడు దశల ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. సాయంత్రం పంచాయతీ ఎన్నికల తేదీపై పూర్తి క్లారిటీ రానుంది. ఇప్పటికే ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు అనుమతినివ్వగా పంచాయతీరాజ్‌శాఖ, ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేపట్టాయి. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 545 గ్రామీణ మండలాల్లోని 12,760 పంచాయతీలు.. 1,13,534 వార్డుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయనుంది.