Naa Anveshana : నా అన్వేషణకు బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి మహిళా కమిషన్..!
- మహిళా కమిషన్‌కు ఫిర్యాదుల వెల్లువ
- అసభ్య కంటెంట్‌పై తీవ్ర అభ్యంతరాలు
- విదేశాల్లో ఉన్న యూట్యూబర్‌పై చర్యలు
- జాతీయ మహిళా కమిషన్‌కు కేసు బదిలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naa Anveshana : ప్రముఖ యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ “నా అన్వేషణ” చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుస్తోంది. సదరు ఛానల్‌లో ప్రసారమవుతున్న కంటెంట్‌పై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు భారీస్థాయిలో ఫిర్యాదులు అందడంతో ఈ వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయికి చేరింది. ప్రధానంగా మహిళలను వస్తువుల్లా చిత్రీకరించడం, వారి పట్ల అసభ్యకరమైన , అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంపై మహిళా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేవలం మహిళల గౌరవానికి భంగం కలిగించడమే కాకుండా, కొన్ని వీడియోలలో బాలల హక్కులను ఉల్లంఘించేలా , చట్టవిరుద్ధమైన అంశాలు ఉన్నట్లు కమిషన్ ప్రాథమికంగా గుర్తించింది.
Normal Delivery Benefits : నార్మల్ డెలివరీ సీక్రెట్స్.. తల్లికి, బిడ్డకు కలిగే టాప్ ప్రయోజనాలు ఇవే!
Also Read
- Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
- Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
- Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
- Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
దీనికి తోడు హిందూ దేవతలపై అత్యంత అభ్యంతరకరమైన, భావోద్వేగాలను దెబ్బతీసేలా అసభ్య వ్యాఖ్యలు చేసినట్లు కూడా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇటువంటి ప్రవర్తన సామాజిక నైతికతను , సమాజంలోని సమతుల్యతను దెబ్బతీస్తుందని కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ప్రస్తుతం సదరు యూట్యూబర్ భారతదేశం వెలుపల నివసిస్తున్నట్లు గుర్తించిన నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఈ కేసును ఉన్నత స్థాయి దర్యాప్తు కోసం జాతీయ మహిళా కమిషన్ (NCW)కు బదిలీ చేసింది.
నిందితుడు విదేశాల్లో ఉన్నందున, అతడిని విచారణకు హాజరు పరిచే అధికారం , అంతర్జాతీయ స్థాయిలో చర్యలు తీసుకునే వీలు జాతీయ కమిషన్‌కు ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వీడియో ఆధారాలు, సోషల్ మీడియా ఖాతాల వివరాలను ఇప్పటికే సేకరించి కేంద్ర అధికారులకు అందజేశారు. మహిళల గౌరవాన్ని కాపాడటం , సామాజిక విలువల పరిరక్షణే లక్ష్యంగా, ఈ వ్యవహారంలో అత్యంత కఠినమైన చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ సెక్రెటరీ జాతీయ కమిషన్‌ను కోరారు. ఈ పరిణామంతో నా అన్వేషణ ఛానల్ భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
Naga Chaitanya : నాగచైతన్య నయా ప్లాన్.. మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఫిక్స్!
తాజావార్తలు
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
-
Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
-
Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!