జాతీయ రహదారుల భూసేకరణపై ఎన్హెచ్ అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి సీరియస్ జాతీయ రహదారుల భూసేకరణపై ఎన్హెచ్ అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీరియస్ అయ్యారు. రైతులకు అడ్వాన్సులు వెయ్యకుండా భూసేకరణ ఎలా చేస్తారని అధికారులను ప్రశ్నించారు. సంవత్సరాలు గడుస్తున్న మన్నెగూడ రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించడం లేదని అడిగారు. వచ్చేవారం మన్నెగూడ పనులు ప్రారంభించండి.. మనం ప్రజల కోసం, రైతుల కోసం పని చేస్తున్నాం – కాంట్రాక్ట్ సంస్థల కోసం కాదు అని ఆయన […]
Future Hub : తొలి ఏడాదిలోనే ప్రజా ప్రభుత్వం హైదరాబాద్ మహానగర అభివృద్ధికి వినూత్న పంథాను అనుసరించింది. గ్రేట్ ప్లాన్ తో.. గ్రేటర్ విజన్ తో సిటీలో ట్రాఫిక్ రద్దీని తట్టుకునేలా ఎలివేటేడ్ కారిడార్లు, మెట్రో, రోడ్లు, రవాణా సదుపాయాల విస్తరణపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచే ప్రత్యేక దృష్టి సారించారు. పెరుగుతున్న జనాభా, నగర విస్తరణకు అనుగుణంగా 2050 మాస్టర్ ప్లాన్ తో గ్రేటర్ సిటీ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించారు. సికింద్రాబాద్లోని […]
CM Revanth Reddy : దేశవ్యాప్తంగా కుల గణన అనేది కాంగ్రెస్ ఆధ్వర్యంలో సాధించే సామాజిక న్యాయం మూడో ఉద్యమమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధమ ప్రధానమంత్రి పండిట్ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ వరకు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, బ్యాంకుల జాతీయీకరణ వంటి కార్యక్రమాలతో సామాజిక న్యాయం మొదటి దశ సాధిస్తే… రాజీవ్ గాంధీ హయాంలో 18 ఏళ్లకే ఓటు హక్కు.. మండల్ కమిషన్ నివేదిక వంటి కార్యక్రమాలతో సామాజిక న్యాయం @ 2.0 […]
Fire Accident : జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని SSV ప్యాబ్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది.. ప్లాస్టిక్ బ్యాగ్స్ తయారీ కంపెనీలో ఈ ప్రమాదం సంభవించింది.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.. సంఘటనా స్థలానికి 3 పైర్ ఇంజన్లు చేరుకొని మంటలను అదుపుచేయడానికి పైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.. ఆస్తి నష్టం భారీ గా ఉండవచ్చని సమాచారం.. సంఘటనా స్థలానికి జీడిమెట్ల సీఐ, బాలానగర్ ఏసీపీ చేరుకొని పర్యవేక్షిస్తున్నారు.. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఇంకా […]
Bandi Sanjay : జేఎన్జే జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి కేటాయించిన ఇండ్ల స్థలాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించడం అత్యంత బాధాకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును గౌరవించాచాల్సిందే. అయితే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు దక్కకపోవడానికి పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీతోపాటు ప్రస్తుత కాంగ్రెస్ పాలకులే ప్రధాన కారణం. 17 ఏళ్ల క్రితం పుస్తెలు తాకట్టు పెట్టి, అప్పు చేసి ఒక్కో జర్నలిస్టు […]
Koti Deepotsavam Day -17: భక్తి, ఎన్టీవీ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ వేడుకలు హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవంబర్ 9న ఆరంభమైన ఈ దీపాల పండుగ దిగ్వజయంగా కొనసాగుతోంది. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కోటి దీపోత్సవ వేడుకకు చేరుకున్నారు. భక్తి టీవీ కోటి దీపోత్సవం 2024 నేడు చివరి రోజు వైభవోపేత వేడుకల మధ్య ముగిసింది. శంఖారావంతో ప్రారంభమైన […]
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్, బీజేపీ క్లారిటీకి రాలేకపోతున్నాయా? ఆశావహులు పెద్ద ఎత్తున ఎవరికి వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటున్నా… అధిష్టానాల వైపు నుంచి ఎందుకు స్పందన లేదు? లెక్కలు పక్కాగా కుదరడం లేదా? లేక అంతకు మించిన సమస్యలు వేరే ఉన్నాయా? అవసరానికి మించిన డిమాండే ఆలస్యానికి కారణం అవుతోందా? లేక అవతలి వాళ్ళని చూసి మనం అభ్యర్థుల్ని ప్రకటిద్దామన్న వైఖరి ఉందా? వచ్చే మార్చిలో ఖాళీ అవబోతున్న ఎమ్మెల్సీ స్థానాల విషయమై తెలంగాణలో ఉత్కంఠ […]
శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయలని అంటారు. ఓ పక్క రాష్ట్రంలో జడలు విప్పిన రేషన్ మాఫియాను కట్టడి చేయడానికి ఏపీ సర్కార్ ప్రయత్నిస్తుంటే… తెలివి మీరిన ముఠాలు కొత్త దారులు వెదుకుతున్నాయట. మాలెక్క తేలిస్తే… మీ లెక్కలు సెటిల్ చేస్తామంటూ… సరికొత్త బేరగాళ్ళు మార్కెట్లో తిరుగుతున్నారట. ఇంతకీ ఎవరు వాళ్ళు? ఏకంగా మాఫియాకే ఆఫర్స్ ఇస్తున్న ఆ ముఠాలేంటి? ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేషన్ మాఫియా వేళ్ళూనుకుని పోయింది. ఇది ఎవరో దారిన పోయే దానయ్య […]
Uttam Kumar Reddy : ప్రాజెక్టులు , రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు పూడికతీత పనులను తక్షణం ప్రారంభించాలని నీటిపారుదల , పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ పనుల కోసం అవసరమైన టెండర్లను వెంటనే పిలవాలని సూచించారు. పూడికతీత పనుల్లో ఆలస్యం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. సోమవారం నీటిపారుదల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ […]