స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇస్తానన్న వంద కోట్లను తెలంగాణ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టెండర్లు.. నిబంధనల మేరకు నిర్వహిస్తారని, ఎవరు టెండర్లలో రాణిస్తే వాళ్లకు ఇస్తారన్నారు.
కాళేశ్వరం నీటి చుక్క వాడకుండానే ఎల్లంపల్లి నుంచి నీరు పొదుపుగా వాడుకొని పెద్ద ఎత్తున వరి పంట పండించామని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. డిఫాల్ట్ రైస్ మిల్లర్లు ఉంటే ఇప్పటికైనా క్లియర్ చేయాలని ఆయన సూచించారు.
ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు జరిగే వేడుకల ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగే ఈ వేడుకల్లో అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Mohan Bhagwat : హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో ఆదివారం లోక్ మంథన్-2024 కార్యక్రమం ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ.. ఏకత అనేది శాశ్వతం.. భిన్నత్వం లో కూడా ఏకత్వం ఉందన్నారు. వాళ్ళ గ్రౌండ్ లోకి వెళ్లి ఆడడం కాదు.. మన గ్రౌండ్ లోకి ప్రపంచాన్ని తీసుకురావాలన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ పై నైతికత పై చర్చ జరుగుతుందని, […]
కాలేజీ రోజులను గుర్తుచేసుకున్న ప్రధాని.. మన్‌కీ బాత్‌లో మోడీ ఏం మాట్లాడారంటే? మహారాష్ట్రలో విజయం సాధించిన తర్వాత ప్రధాని మోడీ ఈరోజు తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో మమేకమయ్యారు. ఈ రోజు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) డే సందర్భంగా ఆయన తన పాఠశాల రోజులను గుర్తు చేసుకున్నారు. దేశంలోని యువత కూడా ఎన్సీసీలో చేరాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు జనవరి 12న వివేకానంద జయంతి సందర్భంగా భారత్ […]
Duddilla Sridhar Babu : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక శివారులో పత్తిపాక రిజర్వాయర్ స్థలాన్ని పరిశీలించారు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం వచ్చి ఏడాది గడవనే లేదు అంతలోనే అల్లావుద్దీన్ అద్భుతదీపంలా పనిచేయాలని ప్రజల్లో నూరి పోస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని ఆయన అన్నారు. అధికారం పోయిందని బీఆర్ఎస్ నాయకులు ప్రతిరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పై ఏడుస్తున్నారని, గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల […]
ఐపీఎల్ మెగా వేలం (IPL 2025) ప్రారంభమైంది. ఆది, సోమవారాల్లో జెడ్డాలో జరుగనుంది. ఈసారి వేలంలో పలువురు స్టార్ ప్లేయర్లు పాల్గొనడంతో మెగా వేలంలో భారత ఆటగాళ్ల ఆధిపత్యం కనిపించబోతోంది. 366 మంది భారతీయులు, 208 మంది విదేశీ ఆటగాళ్లతో కూడిన ఈ మెగా వేలంలో 577 మంది ఆటగాళ్ల భవిష్యత్తు తేలనుంది.
YS Jagan : ఏపీ సీఎం చంద్రబాబు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు చదువులు మానేసుకుంటున్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థులపై కక్షగట్టినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎక్స్ వేదికగా.. ‘@ncbn గారి కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను పిల్లల చదువులకు చెల్లించకపోవడంతో చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. చంద్రబాబుగారు వారిపై కక్షకట్టినట్టు […]
Mithun Reddy : రేపటి నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ… అఖిలపక్ష సమావేశంలో ఏపీకి సంబంధించిన అనేక డిమాండ్లు ప్రస్తావించామని, పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై రాష్ట్ర మంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారన్నారు. పోలవరం ఎత్తు ఎంత అన్నదానిపై రకరకాల ప్రశ్నలు వస్తున్నాయని, పోలవరం అంశంపై పార్లమెంట్ లో చర్చించాలన్నారు మిథున్ రెడ్డి. […]
Lavu Krishna Devarayalu : రేపటి నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న తెలుగు దేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. ఏపీ విభజన అంశాల్లో కొన్ని పూర్తయ్యాయు, ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయన్నారు. 10 ఏళ్లుగా నెమ్మదిగా పోలవరం నిర్మాణం జరుగుతున్న తీరుతెన్నులపై పార్లమెంట్ లో చర్చ జరగాలని కోరానని, కడప స్టీల్ ఫ్యాక్టరీ […]