ఢిల్లీ: నేడు ఇండియా కూటమికి చెందిన భాగస్వామ్యపక్షాల ఫ్లోర్ లీడర్ల సమావేశం. ఉదయం 10 గంటలకు పార్లమెంట్ భవన్లో ఇండి కూటమి భాగస్వామ్యపక్షాల ఫ్లోర్ లీడర్ల భేటీ. అదానీపై అమెరికా చేసిన నేరారోపణలపై విచారణ జరిపేందుకు ‘సంయుక్త పార్లమెంటరీ కమిటీ’ని ఏర్పాటు చేయాలంటున్న భాగస్వామ్యపక్షాలు. డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ. చంద్రబాబు, పవన్‌పై అసభ్యకర పోస్టుల కేసులో ముందస్తు బెయిల్ కోరిన ఆర్జీవీ. అత్యవసరంగా విచారణ జరపాలని విజ్ఞప్తి […]
RGV : ఏపీ పోలీసుల గాలింపుపై డైరెక్టర్ RGV స్పందించారు. ఈ కేసులకు నేనే భయపడడం లేదు అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు ఆర్జీవీ. మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో వర్మపై అభ్యంతరకర పోస్టుల కేసు నమోదైంది. టీడీపీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, రామ్ గోపాల్ వర్మ తన సినిమా వ్యూహం ప్రచారం సమయంలో వైసీపీ ప్రభుత్వాన్ని తక్కువచేసేలా సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అలాగే, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ […]
Duddilla Sridhar Babu : పెద్దపల్లి జిల్లా మంథని లో ప్రజాపాలన విజయోత్సవ దినోత్సవ కార్యక్రమం లో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మహిళలకు కోటీ ఇరవై లక్షల మంది ఉచిత బస్ టికెట్స్ తో ప్రయాణించినట్లు ఆయన తెలిపారు. […]
మానుకోట మహాధర్నాలో బీఆర్ఎస్ పాసా? ఫెయిలా? ఆ కార్యక్రమం చుట్టూ వివాదాస్పద చర్చలు ఎందుకు జరుగుతున్నాయి? భూ కబ్జాదారుల్నే పక్కన పెట్టుకుని పేద రైతులకు న్యాయం చేస్తామని ఎలా అంటారన్న ప్రశ్న ఎందుకు వస్తోంది? ఎవరి కార్యక్రమంలో ఎవరు పెత్తనం చేస్తున్నారన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? లెట్స్ వాచ్. మహబూబ్‌నగర్ జిల్లా లగచర్ల భూ వివాదంలో గిరిజనులపై దాడి జరిగిందని అంటూ… అందుకు నిరసనగా గిరిజన ప్రాంతమైన మహబూబాబాద్‌లో ధర్నా నిర్వహించింది బీఆర్ఎస్. గిరిజనులకు రాష్ట్రంలో ఎక్కడ […]
Damodara Raja Narasimha : గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో రోడ్ల మరమ్మత్తులు లేక రాష్ట్రంలో రోడ్లన్నీ అద్వాన్నంగా తయారయ్యాయి అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మంగళవారం అందోల్ నియోజకవర్గంలో సుమారు 30 కోట్లతో వివిధ రోడ్డు పునర్నిర్మాణం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత పది సంవత్సరాల కాలంలో రోడ్లు మరమత్తు పనులు చేపట్టకపోవడం తో రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి అన్నారు. ప్రస్తుతం […]
సినీ నటుడు శ్రీ తేజపై భార్య సంచలన ఆరోపణలు సినీ నటుడు శ్రీ తేజ్ పెళ్లి పేరుతో అమ్మాయి లను ట్రాప్ చేస్తున్నాడని ఓ యువతీ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రేమ పెళ్లి పేరుతో లొంగదీసుకొని 20 లక్షలు డబ్బులు కాజేశాడని సదురు యువతి ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లయిన మరో మహిళను ట్రాప్ చేసాడు. భార్య తో అక్రమ సంబంధం పెట్టుకోవడం తో ప్రైవేట్ బ్యాంక్ సీనియర్ […]
రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని, రైతులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను, అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. హైదరాబాద్ నుండి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు…
Tummala Nageswara Rao : అన్ని అంశాల్లో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందని, గతంలో ఎప్పుడు లేని విధంగా ధాన్యం కొనుగోలు, పేమెంట్ సక్రమంగా జరుగుతున్నాయని కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మిల్లులకు ధాన్యం కోసం లారీల ఇబ్బంది లేకుండా చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. సన్నరకం పండించిన రైతులకు బోనస్ గా 500 రూపాయలు ఇవ్వడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని, కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు […]
Fancy Numbers Demand : ప్రతిరోజూ మార్కెట్లోకి విభిన్న ఫీచర్లతో ఉన్న వాహనాలు ప్రవేశిస్తున్నాయి. కొందరు తమకు నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేయడానికి లక్షల రూపాయలు ఖర్చు చేసేందుకు కూడా సిద్ధంగా ఉంటారు. అంతేకాదు, తాము కొనుగోలు చేసిన వాహనం ప్రత్యేకంగా ఉండేందుకు రిజిస్ట్రేషన్ నంబరును కూడా ప్రత్యేకంగా తీసుకోవాలని భావిస్తారు. ఖర్చు ఎంతైనా సరే, ఇష్టమైన వాహనానికి ఫ్యాన్సీ నంబర్ దక్కించుకోవడంలో వెనుకాడరు. ఇందుకోసం వేలంపాటలో పాల్గొని ప్రత్యేక నంబర్లు పొందుతారు. ఈ ఉత్సాహం […]
ఈనెల 28 , 29 , 30 తేదీల్లో మహబూబ్ నగర్ లో నిర్వహించే రైతు పండుగ విజయవంతంగా నిర్వహించడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు కలసి పనిచేయాలని రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజానర్సింహా, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణా రావు లు అన్నారు.