Botsa Satyanarayana : విద్యుత్ చార్జీలపై రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న వ్యతిరేకత ను చూసైనా ప్రభుత్వం వెనక్కు తగ్గాలన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను పక్కనబెట్టిన ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో కాలక్షేపం చేస్తోందన్నారు. జనవరి 3న జరగాల్సిన వసతి దీవెన ఆందోళనలను పరీక్షల నేపథ్యంలో జనవరి 29కి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆరునెలల్లో లక్ష కోట్లు అప్పు చేసిందన్నారు బొత్స సత్యనారాయణ. ఈ స్థాయిలో అప్పులు చేసి పెన్షన్ 4 వేలు తప్ప ఇక ఏమి మేలు చేశారో చెప్పాలన్నారు. ప్రజలకు ఒక్క రూపాయి ఇవ్వకుండా పది లక్షల కోట్లు అప్పులు చేయడానికి ప్రభుత్వం మానసికంగా సిద్ధం అయినట్టు కనిపిస్తోందన్నారు బొత్స సత్యనారాయణ. హనీమూన్ పీరియడ్ అయిపొయింది…..ఆత్మ పరిశీలన చేసుకుని హామీలు అమలు చేయండన్నారు.
Jeevan Reddy: కేంద్రం మన్మోహన్ సింగ్‌ను భారత రత్నతో గౌరవించాలి..
అంతేకాకుండా..’కొత్త సంవత్సరంలోనైన ప్రజలను సుఖంగా ఉండనివ్వండి….. ఫ్రీ బస్సు లాంటి తక్కువ ఖర్చుతో అయిపోయే హమీలు నెరవేర్చడానికి ఇబ్బందులు ఎందుకు… విద్యుత్ చార్జీలు పెంపు ఎవరి పాపమో మంత్రులకు తెలియదా….చదువుకో లేదా…?. ధాన్యంలో తేమ లెక్కలు చూపించి 20 నుంచి 30శాతం కోత పెడుతున్నారు… ప్రభుత్వం తెచ్చిన అప్పులు, సూపర్ 6పై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం…. సూపర్ 6 అమలు కోసం ప్రభుత్వాన్ని నిలదీసి పని చేయిస్తాం….. తప్పు చేసిన, ఇచ్చిన మాట హామీలు నెరవేర్చ క పోయిన ప్రశ్నిస్తా నని చెప్పిన.. డిప్యూటీ సీఎం పవన్ ఎందుకు మాట్లాడటం లేదు….. ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద వుంది…. ప్రజా సమస్యలపై పోరాటంలో కలిసి వచ్చే వాళ్ళను కలుపుకుని వెళ్లే ఆలోచన చేస్తాం…. కొండపల్లి ఇష్యూ తెలుగుదేశం పార్టీ క్రియేషన్….. వాళ్ళలో వాళ్ళే సృష్టించుకుంటున్నారు…..గతంలో ఇటువంటి వ్యవహారాలు వుండేవి కాదు…… అభద్రత భావంతో వున్న వాళ్ళే ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారు… కొండపల్లిని ఇబ్బంది పెట్టే చర్యలు….బలిచ్చే ప్రయత్నంగా కనిపిస్తోంది…. నా కాళ్ళకు మొక్కారా లేదా అనేది అప్రస్తుతం….ఆ వ్యవహారం జోలికి నేను వెళ్ళను….. టీడీపీ నాయకులు విజయనగరం వెళ్లి చూస్తే బొత్స మార్క్ అభివృద్ది ఏమిటో తెలుస్తుంది….’ అని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు.
Puri Musings: న్యూయర్ వేళ.. “భక్తుడు-దేవుడు” ఆసక్తికర కథ చెప్పిన పూరి జగన్నాథ్..