Nadendla Manohar : తూర్పుగోదావరి జిల్లా రాజానగరం రాయల్ కన్వెన్షన్ హల్‌లో జరిగే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకుని ఇటీవల మరణించిన బాధిత కుటుంబసభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల పాల్గొన్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నాదెండ్ల మనోహర్ రాజానగరం చేరుకున్నారు. ముందుగా మధురపూడి ఎయిర్‌పోర్ట్ చేరుకుని.. అక్కడి నుండి రాజానగరం చేరుకున్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకుని ఇటీవల మరణించిన వారి బాధిత కుటుంబసభ్యులకు చెక్కుల పంపిణీ చేశారు. 21 మందికి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు చెక్కులు పంపిణీ చేశారు నాదెండ్ల మనోహర్. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్తను జనసేన పార్టీ ఆదుకుంటుందన్నారు. పవన్ కల్యాణ్ వలన దేశంలో జనసేన పార్టీకి గుర్తింపు వచ్చిందని, జాతీయ నాయకులతో మన్ననలు పొందారన్నారు నాదెండ్ల మనోహర్. పవన్ కల్యాణ్ కోసం కాదు జనం కోసం కార్యకర్తల కోసం నిలబడ్డారని, ప్రజా సమస్యలపై పోరాడే విధంగా నిలబడ్డామన్నారు నాదెండ్ల మనోహర్.
Grimes: ‘‘నా సవతి తండ్రి ఓ భారతీయుడు’’.. ఎలాన్ మస్క్ మాజీ ప్రియురాలు..
అంతేకాకుండా.. ‘ఈ కార్యక్రమం చేసిన నిజాయితీగా స్వచ్ఛందంగా చేసాం. జనసేన పార్టీ ఏం చేస్తుందని అవమానించారు. కూటమీ ప్రభుత్వంలో ఏమి చేయగలమో నిరూపించాం. గ్రామస్థాయి నుంచి జనసేన పార్టీని పటిష్టపరుచుకోవాలి. పార్టీ కోసం సృష్టించి పనిచేసిన వారికి ప్రతి ఒక్కరికి పదవి గుర్తింపు వస్తుంది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు తీసుకుని వెళ్లాలి. తద్వారా జనసేన పార్టీ ప్రతిష్టతకు పాటుపడాలి. రైతులు వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి గత ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. గత ప్రభుత్వం రైతులకు బకాయిపడిన 1445 కోట్ల రూపాయలు చెల్లించాం. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే డబ్బులు రైతు ఖాతాలో వేస్తున్నాం. మా నాయకత్వం బలత్పరచడానికి కార్యకర్తలు సహకరించాలి. రాష్ట్రంలో కోటి యాభై లక్షలు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అర్హులైన అందరికీ ఉచిత గ్యాస్ ఇచ్చాం.’ అని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.