ఏపీ హైకోర్టులో వైసీపీ సోషల్ మీడియా నేతలు సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ చేపట్టింది. మొత్తం 8 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని సజ్జల భార్గవ్‌రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు.. అయితే... అన్ని పిటిషన్లపై నేడు విచారణ చేసిన ఏపీ హైకోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది.
ఆర్టీసీ కార్గో పార్సిల్లో లక్ష రూపాయల చీర… బస్సు డ్రైవరు ఫోన్ స్విచ్ ఆఫ్ ఖరీదైన చీర మాయం కావడంతో ఆర్టీసీ అధికారుల మెడకు చుట్టుకుంది. చీర ఎక్కడుందో తెలియక కార్గో ఉద్యోగులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఆర్టీసీ కార్గో సర్వీసులను నిర్వహిస్తోంది. పార్శిళ్లను సకాలంలో పంపిణీ చేస్తుండటంతో చాలామంది ఆర్టీసీ కార్గో సేవల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వినుకొండ డిపోకి రావాల్సిన పార్శిల్ రాకపోవడంతో కార్గో ఉద్యోగులు హైరానా పడుతున్నారు. ఎందుకంత […]
Murder : విజయనగరం జిల్లా భోగాపురం మండలం లింగాలవలసలో వివాహిత హత్య అనుమానిస్తున్నారు. కనకల మధు లక్ష్మి భర్తే హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. విజయవాడకు చెందిన ముని ఆదిబాబుతో తొలిత మధులక్ష్మి వివాహం జరిగింది. అతను చనిపోవడంతో లక్ష్మి తమ కొడుకుతో కలిసి తల్లిదండ్రుల ఊరు లింగలవలసకు వచ్చేసింది. ఇదే క్రమములో గ్రామములో కనకల రామారావు ను వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. లక్ష్మి తన 8 ఏళ్ల […]
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, అదానీ సోలార్ ప్రాజెక్టు అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పరిశీలిస్తున్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. పవన్, ఢిల్లీ పర్యటనలో భాగంగా, ఉప రాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం, కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌తో భేటీ అయిన పవన్, మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలపై ధ్వజమెత్తారు. Adani Group: అమెరికాలో […]
Raghurama Krishnaraju : సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయ్‌పాల్ ను అరెస్ట్ చేయడం సంతోషంగా అనిపించిందన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ ఎన్నో దందాలు చేశారని, ఆయన పాపం పండిందన్నారు. తెలియదు అని క్రిమినల్ లాగా సమాధానాలు చెప్తున్నారు అని తెలిసిందని, నన్ను కస్టోడియల్ టార్చర్ చేశారని ఆయన వ్యాఖ్యానించారు. అసలు కుట్ర చేసింది పీవీసునీల్ కుమార్ అని ఆయన అన్నారు. […]
APSRTC : ఖరీదైన చీర మాయం కావడంతో ఆర్టీసీ అధికారుల మెడకు చుట్టుకుంది. చీర ఎక్కడుందో తెలియక కార్గో ఉద్యోగులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఆర్టీసీ కార్గో సర్వీసులను నిర్వహిస్తోంది. పార్శిళ్లను సకాలంలో పంపిణీ చేస్తుండటంతో చాలామంది ఆర్టీసీ కార్గో సేవల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వినుకొండ డిపోకి రావాల్సిన పార్శిల్ రాకపోవడంతో కార్గో ఉద్యోగులు హైరానా పడుతున్నారు. ఎందుకంత హైరానా అనుకుంటున్నారా..! Hyderabad: నగరంలో వరుస అగ్నిప్రమాద ఘటనలు.. నిన్న జీడిమెట్ల, […]
నేడు ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ (బుధవారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పవన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన నిధులు, విభజన అంశాలు, కేంద్ర ప్రభుత్వ సహకారంపై ప్రధానితో ఆయన చర్చించనున్నారు. అలాగే, జలజీవన్ మిషన్ స్కీమ్‌లో భాగంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులను సైతం ఇవ్వమని కోరనున్నారు. ఈ పథకాన్ని కొనసాగించాలని కోరే అవకాశం ఉంది. […]
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఈరోజు తుఫానుగా మారే అవకాశం ఉందని, ఆ తర్వాత రెండు రోజుల్లో శ్రీలంక తీరాన్ని దాటుకుని తమిళనాడు వైపు వెళ్లే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్‌కు'ఫెంగల్'గా నామకరణం చేశారు.
రేపటి నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో నిర్వహించనున్న కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నిన్న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. పద్మావతి అమ్మవారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించి, ఆ తరువాత కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు.
RGV : వివాదాలకు కేరాఫ్ అడ్రస్, ప్రముఖ డైరెక్టర్ ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ చేయనుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. మొత్తం మూడు పిటిషన్లు దాఖలు చేశారు వర్మ.. ప్రకాశం జిల్లా, విశాఖ జిల్లా, గుంటూరు జిల్లాల్లో తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ.. హైకోర్టు మెట్లు ఎక్కారు వివాదాస్పద దర్శకుడు.. అన్ని పిటిషన్లపై నిన్న ఒకేసారి విచారణ చేపట్టిన హైకోర్టు ఈరోజుకు వాయిదా వేసింది. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ […]