Minister Narayana : నరేడ్కో (నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్)సెంట్రల్ జోన్ డైరీ 2025 ను మంత్రి నారాయణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మేల్యేలు బోండా ఉమా, యార్లగడ్డ వెంకట్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ ను ఘనంగా NAREDCO సభ్యులు సత్కరించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలుసు అని అన్నారు. మూడు ముక్కలాటతో అమరావతినీ గత పాలకులు నాశనం చేశారని, రెండో సారి సీఎం నాకు మళ్ళీ పురపాలక శాఖ అప్పగించి రియల్ ఎస్టేట్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఊపు తీసుకొచ్చేందుకు ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చామని ఆయన అన్నారు.
Komuravelle: రేపు మల్లికార్జున స్వామి కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రులు
భవన నిర్మాణాలు, లే అవుట్ లకు అనుమతులనుండరాలతరం చేస్తూ ఈ నెలాఖరుకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. 500 మీటర్లు కంటే పైన నిర్మాణాలు చేసే భవనాలు కు సెల్లార్ అనుమతులు ఇస్తున్నామని, లే అవుట్ లలో రోడ్లకు గతంలో ఉన్న 12 మీటర్లను 9 మీ తగ్గించామని మంత్రి నారాయణ అన్నారు. అన్నీ అనుమతులు తేలికగా వచ్చేలా సింగిల్ విండో ఆన్ లైన్ సిస్టమ్ తీసుకొస్తున్నామని, ఫిబ్రవరి నెలాఖరులోగా సింగిల్ విండో విధానం అందుబాటులోకి తెస్తామని మంత్రి నారాయణ తెలిపారు. భవన నిర్మాణాలకు 15 రోజుల్లోనే అనుమతులు వచ్చేలా మార్పులు చేస్తున్నామని, సంక్రాంతి తర్వాత అమరావతి పనులు ప్రారంభం అవుతాయన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెరగాలంటే రియల్ ఎస్టేట్ కూడా బాగుండాలని, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వానికి సహకరించాలన్నారు మంత్రి నారాయణ.
HCA: అండర్19 టీ20 వరల్డ్‌కప్‌కు తెలంగాణ క్రికెటర్లు ఎంపిక.. ఘనంగా సన్మానం