Justice NV Ramana : తెలుగు భాషను భవిష్యత్తు తరాలకు పదిలంగా అందించాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరో తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ జ్యోతి ప్రజ్వలన చేసి ఆరంభించారు. మహాసభలకు ముందు తెలుగు తల్లి విగ్రహానికి అంజలి ఘటించడం జరిగింది.
ఈ మహాసభల్లో ఎంపీ సుజనా చౌదరి, మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్, విశ్వహిందీ పరిషత్తు జాతీయ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ఈనాడు ఏపీ సంపాదకుడు ఎం.నాగేశ్వరరావు, తెలంగాణ శాసనమండలి సభ్యుడు గోరటి వెంకన్న, సినీ గేయకవి భువనచంద్ర, ఆచార్య కొలకలూరి ఇనాక్ తదితరులు పాల్గొన్నారు. మహాసభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలుగు మహనీయుల ఫొటో ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Bank Holidays In January: 2025 జనవరిలో దాదాపు 15 రోజులు బ్యాంక్ సెలవులు..
విజయవాడలోని కె.బి.ఎన్. కళాశాలలో నిర్వహించిన ఈ మహాసభలకు దేశవిదేశాల నుంచి 1,500 మందికి పైగా రచయితలు, కవులు, భాషాభిమానులు హాజరయ్యారు. పొట్టి శ్రీరాములు సభా ప్రాంగణంలోని చెరుకూరి రామోజీరావు ప్రధాన వేదికతో పాటు మరో రెండు వేదికల్లో సదస్సులు, కవితా సమ్మేళనాలు జరిగాయి. ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కృష్ణా జిల్లా రచయితల సంఘం, కె.బి.ఎన్. కళాశాల సంయుక్తంగా ఈ మహాసభలను నిర్వహించారు.
మహాసభల్లో భాగంగా రెండు రోజులపాటు 25కు పైగా సదస్సులు, కవితా సమ్మేళనాలు నిర్వహించారు. 800 మంది భాషాభిమానులు వేదికలపై ప్రదర్శన చేసుకునే అవకాశం పొందగా, ప్రాంగణంలో దివంగత ప్రముఖ కవుల ముఖచిత్రాలతో విస్తృత ప్రదర్శన ఏర్పాటు చేశారు.
తెలుగు భాషా ప్రాధాన్యాన్ని పెంచేందుకు రాజకీయ, న్యాయ, పరిపాలన రంగాలపై ప్రత్యేక సదస్సులు నిర్వహించారు. పత్రికలు, ప్రసార మాధ్యమాలు, ఇతర రాష్ట్రాల మహిళా ప్రతినిధుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. భాషోద్యమం, శాస్త్రసాంకేతిక రంగాల్లో తెలుగు భాషకు ప్రాధాన్యం కట్టుబట్టే దిశగా పలు కార్యక్రమాలు చేపట్టారు.
మహాసభలో మాట్లాడిన జస్టిస్ ఎన్.వి.రమణ, తెలుగు భాష వినసొంపైనదని, సామాన్య ప్రజలు కూడా కవితా ధోరణిలో మాట్లాడగల అద్భుతమైన భాషగా కొనియాడారు. తెలుగు భాషను వ్యాపార, రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర సంస్కృతులు అధికంగా ప్రభావితం చేయడాన్ని అంగీకరించకూడదని పిలుపునిచ్చారు. తెలుగు భాషను కాపాడుకుందాం.. తెలుగు జాతి కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచానికి చాటి చెప్పుదామన్నారు ఎన్వీ రమణ.
Perni Nani: కొద్ది రోజులుగా నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు..