Moinabad Farmhouse : ఇటీవల హైదారాబాద్ నగర శివారు మొయినాబాద్ పరిధిలోని తొల్కట్టలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తుండటంతో పోలీసులు దాడి చేసి పందెంరాయుళ్లతో పాటు పందెం కోళ్లను పట్టుకున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే.. ఈ రోజు మొయినాబాద్ తోల్కట్ట ఫామ్ హౌస్ కేసులో స్వాధీనం చేసుకున్న పందెం కోళ్లకు వేలం వేశారు. అయితే.. రాజేంద్రనగర్ కోర్టు ఆవరణలో పందెం కోళ్లకు వేలం నిర్వహిస్తున్నారు సిబ్బంది. ఈ వేలం పాటలో 84 కోళ్లకు వేలం పాట కొనసాగుతుండగా.. ప్రజలు వేలం పాటపై ఆసక్తి చూపుతున్నారు. అయితే.. 50 వేల నుండి మొదలైంది వేలం పాట.
Hyderabad: ‘మీ ఆవిడని నాకిచ్చేయ్’.. ప్రియురాలి భర్తతో ప్రియుడు గొడవ
10 కోళ్లు 2 లక్షల 50 వేలు పలికాయి. ఉప్పరపల్లి కోర్టు ఆదేశాల మేరకు పందెం కోళ్ల వేలం ఏర్పాటు చేశారు. 10 కోళ్లు కలిపి ఓక స్లాట్ గా ఉంచి వేలం నిర్వహిస్తున్నారు. జడ్జి సమక్షంలో ఈ పందెం కోళ్ల వేలం జరుగుతోంది. అయితే.. ఇటీవల పట్టుబడ్డ పందెం రాయుళ్లు ఈ వేలం పాటలో పాల్గొనడం గమనార్హం. అయితే.. 10 కోళ్ల స్లాట్ ను 2,50,000లకు కొనుగోలు చేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి. ఇంకా వేలం పాటు జోరుగా కొనసాగుతోంది. ఈ వేలంలో 16 మంది అడ్వకేట్లు, 57 మంది సివిలియన్స్ పాల్గొన్నారు.
Ramzan: ముస్లిం ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం