Komatireddy Venkat Reddy : కృష్ణా జలాల్లో తీవ్ర అన్యాయం చేసిన కేసీఆర్, హరీష్ రావు లను ఉరి తీసిన తప్పు లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాలమూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్ లు పోయాయన్నారు. 36 సీట్లలో బీఆర్‌ఎస్ కు మూడు సీట్లే వచ్చాయని, కృష్ణా పరివాహక ప్రాంతం. దక్షిన తెలంగాణ ప్రాంతం శాపం తగిలిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. 20 నెలల్లో SLBC పూర్తి చేసి నీళ్లు పారిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ డ్యాం వద్దకు కేసీఆర్ హయాంలోనే ఏపీ అధికారులు రావడం.. Crpf కు అప్పగించింది కూడా వాళ్ల హయాంలోనే జరిగిందన్నారు.
Uttam Kumar Reddy : ప్రాజెక్టు వల్ల నీళ్లు రాలేదు కానీ.. వాళ్ల జేబులు నిండాయి.
సాగునీటి ప్రాజెక్టు ల విషయం ప్రతీ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చిత్తశుద్ధితో పని చేస్తున్నామన్నారు. కృష్ణా బేసిన్ లో గత పదేళ్లలో తెలంగాణ కేవలం 30 శాతం మాత్రమే వాడిందని, మేము వచ్చాక కృష్ణా లో తెలంగాణ కు 50 శాతం షేరింగ్ అడుగుతున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. గత పాలకులు మోసం, దగా తో డబ్బులు దండుకున్నారని, Go 203 తో ప్రతీ రోజు 3 టీఎంసీ లు తరలించేలా జగన్ చేసిన ప్రయత్నాలకు సహకరించారన్నారు. ఆఖరికి ఆపేక్స్ కౌన్సిల్ మీటింగ్ ను కూడా.. ఏపీ కి సహకరించేలా వ్యవహరించారని, రాయలసీమ లిఫ్ట్ పనుల కోసం ఆపేక్స్ కౌన్సిల్ మీటింగ్ ను వాయిదా వేశారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
Chilli Prices: మిర్చి ధరలపై ఏపీ ప్రతిపాదనలు.. రేపు కేంద్రమంత్రి కీలక సమావేశం..