Republic Day : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత గణతంత్ర దినోత్సవమైన జనవరి 26న కర్తవ్య పథ్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. దీనితో పాటు 21 తుపాకుల గౌరవ వందనం ఇవ్వబడుతుంది. ఈ సందర్భంగా ఇండోనేషియా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరవుతుండగా.. భారతదేశ అభివృద్ధి, శక్తిని ప్రత్యక్షంగా ప్రదర్శించనున్నారు. అయితే 21 గన్ సెల్యూట్ ఇచ్చే సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఇందులో నిజంగా 21 తుపాకులను ఉపయోగిస్తారా? సెల్యూట్లో ఏ ఫిరంగిని ఉపయోగించారో […]
Shadnagar Murder : షాద్‌నగర్ శివలీల (35) హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం కారణంగానే శివలీల హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లి చేసుకోమన్నందుకు శివలీలను హత్య చేసిన రౌడీషీటర్ దేవదాస్ గతంలోనూ రెండు హత్యలు, అత్యాయత్నాల కేసులో నిందితుడని పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. ఫరూఖ్‌నగర్ మండలం పిట్టలగడ్డతండాకు చెందిన శివలీల తన భర్త మృతి చెందడంతో తన తల్లి దగ్గర ఉంటూ.. కన్హాశాంతివనంలో కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. కర్నూల్‌కు […]
బీజేపీలో చేరిన మేయర్, కార్పొరేటర్లు.. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర ఆరోపణలు కరీంనగర్ మేయర్ సునీల్ రావుతో సహ పలువురు కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మేయర్ తో పాటు బీజేపీలో చేరిన వారిలో శ్రీదేవి చంద్రమౌళి, లెక్కల స్వప్న వేణు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ నుంచి వచ్చినప్పటికీ ఇప్పటికీ నీ పరిస్థితి ఏంటి? […]
Bade Chokkarao : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దక్షిణ బస్తర్ కాంకేర్, మారేడుబాక అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ ప్రకటన చేసింది. ఈ ఎన్కౌంటర్లో తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ సెక్రటరీ దామోదర్ అలియాస్ బడే చొక్కారావు (Bade Chokkarao) మృతిచెందినట్లు పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే, మావోయిస్టు పార్టీ ఈ ప్రచారాన్ని ఖండించింది. దామోదర్ మృతిచెందలేదని, ఆయన క్షేమంగా ఉన్నారని స్పష్టం చేస్తూ ఒక లేఖ విడుదల చేసింది. ఈ లేఖను సౌత్ […]
Uttam Kumar Reddy : తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా, కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 26న నాలుగు కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టనుంది. తెలంగాణ రైతాంగం, ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పథకాలు ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాలను రేపు అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో, హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి […]
Republic Day 2025 : 2025 రిపబ్లిక్ డే సందర్భంగా, కేంద్ర ప్రభుత్వం పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు, పౌర రక్షణ సేవలకు సంబంధించిన మొత్తం 942 మంది సిబ్బందిని గ్యాలంట్రీ అవార్డులతో గౌరవించింది. వీరిలో 746 మందికి పోలీస్ విశిష్ట సేవా పతకాలు (మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్), 101 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 95 మందికి గ్యాలంట్రీ పతకాలు, అలాగే 2 మందికి ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ అందజేశారు. గ్యాలంట్రీ అవార్డుల్లో […]
Harish Rao : ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం వార్తమన్నూరుకు చెందిన రైతు మామిళ్ళ నర్సయ్య అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విచారకరమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే గడిచిన వారం రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని, రైతుల మరణ మృదంగం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పాలనలో […]
Uttam Kumar Reddy : మాజీ మంత్రి హరీష్ రావు పచ్చి అబద్ధాలు, అసత్యాలు జనంలోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్. ఇరిగేషన్ ప్రాజెక్టులపై తప్పుడు ప్రాపగండా చేస్తున్నారని, అద్భుతాలు చేస్తున్నట్లు కేసీఆర్, హరీష్ నటించారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఇరిగేషన్ కు తీరని అన్యాయం జరిగిందని, లక్ష కోట్లు తెచ్చి కాళేశ్వరం కడితే వాళ్ళ టైమ్ లో కట్టిన ప్రాజెక్టు.. కూలిపోయిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ […]
Narcotic drugs : నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ కింద పట్టుబ డిన ఎన్డీపీఎస్ డ్రగ్స్ గంజాయిని జనవరి 10 నుంచి 25 లోపు డిస్పోజల్ చేపట్టాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ అదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 2024 డిసెంబ రు 23న నోటిపతికేషన్ జారీ చేసింది. తెలంగాణలో కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి ఎక్సైజ్ శాఖలోని డిప్యూటి […]
డబ్బుతో ఓట్లు కొనేవారికి బుద్ధి చెప్పండి.. ప్రజలకు కేజ్రీవాల్ పిలుపు దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికలను ఉద్దేశించి ఆప్ అధినేత కేజ్రీవాల్ వీడియో సందేశం విడుదల చేశారు. డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసే పార్టీలకు బుద్ధి చెప్పాలని ప్రజలకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. కేజ్రీవాల్ వరుస వీడియోలు విడుదల చేస్తున్నారు. గురువారం వీడియోలో ఐదేళ్లలో నిరుద్యోగం లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకొచ్చారు. తాజాగా శుక్రవారం విడుదల చేసిన వీడియోలో […]