CM Revanth Reddy : నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రూ.130 కోట్లతో నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాల, హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి , రూ.26 కోట్లతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.40 కోట్లతో 100 పడకల యూనిట్ కు, రూ.296 కోట్లతో తుంకిమెట్ల నారాయణపేట రోడ్, కొత్తకొండ మద్దూర్ రోడ్ అభివృద్ధి పనులకు, అప్పకపల్లి గుండామల్ రోడ్, మద్దూర్ లింగాల్ చెడ్ రోడ్ లలో హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రూ.193 కోట్లతో గుల్బర్గా కొడంగల్, రావులపల్లి మద్దూరు, కోస్గి దౌలతాబాద్ రోడ్ల అభివృద్ధి పనులకు, రూ.12.70 కోట్లతో నారాయణపేట నియోజకవర్గంలో సిఆర్ఆర్ రోడ్లకు శంకుస్థాపన చేశారు.
Skoda : బాంబే హైకోర్టు కీలక నిర్ణయం.. 12 వేల కోట్లు చెల్లించనున్న స్కోడా.. అసలేమైంది?
అంతేకాకుండా.. రూ.56 కోట్లతో నిర్మించిన మెడికల్ కళాశాల అకడమిక్ బ్లాకులను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. రూ.5.58 కోట్లతో నిర్మించిన ధన్వాడ, నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ భవనాలను సీఎం రేవంత్ ప్రారంభించారు. రూ.1.23 కోట్లతో జిల్లా మహిళా సమాఖ్య నిర్వహించే పెట్రోల్ బంక్ ను, రూ.7 కోట్లతో మరికల్ మండల పరిషత్ ఆఫీసు కాంప్లెక్స్ భవనంను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మారుమూల పల్లెలకు వైద్య సేవలు అందిస్తామన్నారు. మెడికల్ కాలేజీలకు నిధులు లోటు రానివ్వమని, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ లేకుండా గొప్ప డాక్టర్లు కాలేరన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వైద్య వృత్తి అనేది ఉద్యోగం కాదు అదో బాధ్యత అని, వైద్యసేవ అనేది మానవత్వంతో చేయాల్సిన డ్యూటీ అని ఆయన వ్యాఖ్యానించారు. అద్దాల మేడలు, రంగుల మేడలు అభివృద్ధి కాదని అంబేద్కర్ అన్నారని, పేదలకు నాణ్యమైన వైద్యం అందాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.