GHMC : ఆస్తిపన్ను బకాయిల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఖైరతాబాద్ జోన్ పరిధిలో టాప్ టెన్ బకాయి విలువ 203 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారెంట్లు జారీ చేసింది జీహెచ్‌ఎంసీ. వందమందికి రెడ్ నోటీసులు జారీ చేసింది జీహెచ్‌ఎంసీ. 5 లక్షలకుపైన ఉన్న బకాయిల విలువ 860 కోట్లుగా అధికారులు తేల్చారు. ఈ చర్యలలో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు ఇటీవల బంజారాహిల్స్ ప్రాంతంలోని ప్రముఖ తాజ్ బంజారా హోటల్‌ను సీజ్ చేశారు. హోటల్ యాజమాన్యం రూ.1.43 కోట్ల బకాయిని చెల్లించకుండా నిర్లక్ష్యం వహించడంతో రెండు సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. ఫలితంగా గురువారం సాయంత్రం జీహెచ్ఎంసీ అధికారులు హోటల్‌పై సీల్ విధించారు. అయితే, హోటల్ యాజమాన్యం వెంటనే స్పందించి శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆర్టీజీఎస్ ద్వారా రూ.51.50 లక్షలు చెల్లించింది. మిగిలిన బకాయిని మార్చి 15లోపు చెల్లించేందుకు పరిమితి కోరింది. వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు హోటల్‌పై విధించిన సీల్‌ను తొలగించారు.
ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లను 100 శాతం పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్న నేపథ్యంలో, జీహెచ్ఎంసీ సర్కిల్ స్థాయి అధికారులు ట్యాక్స్ కలెక్షన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఫిబ్రవరి నెలలో 6 లక్షల ప్రాపర్టీలకు నోటీసులు జారీ చేయగా, 60 ప్రాపర్టీలకు సీల్ వారెంట్లు అమలు చేశారు. ఫిబ్రవరి 18 నుంచి ట్యాక్స్ చెల్లించని ప్రాపర్టీలను సీల్ చేసి మరీ పన్ను వసూలు చేస్తున్నారు. ఇప్పటివరకు జీహెచ్ఎంసీకి మొత్తం రూ.11,668 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు ఉన్నాయి.
వీటిలో:
జూబ్లీహిల్స్ లాండ్ మార్క్ ప్రాజెక్ట్ బకాయి 52 కోట్లు.
ఎల్ అండ్ టీ మెట్రో రైల్ బకాయి 32 కోట్లు.
హైదరాబాద్ ఆస్బెస్టాస్ సంస్థ బకాయి 30 కోట్లు.
ఇండో అరబ్ లీగ్ బకాయి 7.33 కోట్లు.
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బకాయి 5.5 కోట్లు.
సోమాజిగూడ లోని కత్రియా హోటల్ బకాయి 8.62 కోట్లు.
Home Ministry: ముగ్గురు ఐపీఎస్‌లకు కేంద్రం షాక్.. 24 గంటల్లో ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు..