MLC Kavitha : నిజామాబాద్ పసుపు యార్డు ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. నిజామాబాద్ పసుపు యార్డులో.. రైతులు దారుణంగా మోసపోతున్నారని, వారం రోజులుగా ధరలు పడిపోయాయన్నారు. కేంద్రం 15 వేలు మద్దతు ధర ఇస్తామని గొప్పలు చెప్పి రైతులను మోసం చేశారని, పసుపు బోర్డు కు చట్ట బద్దత లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. పార్లమెంట్ లో బిల్లు పెట్టీ .. బిల్లు పాస్ చేస్తే రైతులకు మేలు జరుగుతుందని, పసుపు మార్కెట్ లో రైతులను బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి అని ఆమె మండిపడ్డారు. ప్రభుత్వం పట్టించుకోక పోవడం వల్లే ఈ పరిస్థితి అని, పసుపు కు 12 వేలు ఇస్తామని గతంలో సీఎం రేవంత్ చెప్పారన్నారు. పసుపు రైతులకు బోనస్ ఇవ్వాలని, కేంద్రం పై పసుపు 15 వేలు ధర ఇవ్వాలని పోరాటం ఉంటుందన్నారు. పసుపు బోర్డుకు చట్ట బద్ధత కల్పించాలని బీఆర్‌ఎస్ తరపున పోరాటం చేస్తామన్నారు ఎమ్మెల్సీ కవిత.
Vijayawada: యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వాహణ.. 10 మంది మహిళలు అరెస్ట్
మార్చి 01 వరకు ప్రభుత్వం దిగి రాకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజా భవన్‌లో రేవంత్, చంద్రబాబు మీటింగ్ అనంతరం నీటి దోపిడీ మొదలైందని ఆరోపించారు. చంద్రబాబు ప్రతిపాదనపై ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాయాలి, న్యాయ పోరాటం చేయాలన్నారు. తెలంగాణ రైతుల ఊసురు తీసి చంద్రబాబుకు గురు దక్షిణ చెల్లిస్తున్నారా..? అని ఆయన వ్యాఖ్యానించారు. నిజామాబాద్ పసుపు రైతుల సమస్యలపై మార్చి 01 వరకు ప్రభుత్వానికి డెడ్ లైన్ అని, అప్పటి వరకు 12 వేలు బోనస్ ఇవ్వాలి, లేకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామన్నారు. సీఎంకు సుప్రీం కోర్టు చివాట్లు పెట్టిందని, నా పై విమర్శలు చేస్తే ఆయన్ స్థాయి తగ్గుతుందన్నారు కవిత.
Emergency: ‘ఎమర్జెన్సీ’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన కంగనా!