మామునూరు రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి.. సీఎం దిగ్భ్రాంతి వరంగల్ జిల్లా మామునూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారత్ పెట్రోల్ పంప్ సమీపంలో ఐరన్ లోడుతో వెళ్తున్న లారీ.. రెండు ఆటోలను ఢీ కొట్టింది. దీంతో.. భారీ ఐరన్ రాడ్లు ఆటోపై పడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఐనవోలు మండలం పంథిని వద్ద యూరియా బస్తాలు […]
TPCC Mahesh Goud: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం అప్పరెడ్డి గూడ గ్రామంలో ప్రజా పాలన లో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నాలుగు పథకాల ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి గా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కాంగ్రెస్ నాయకులు కుసుమ కుమార్, శివసేనా రెడ్డి తదితరులు హాజరయ్యారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లబ్దిదారులకు రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, […]
Ponnam Prabhakar : ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ పేదవారికి ఇళ్లు అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇంతకు ముందు ప్రభుత్వం రేషన్ కార్డులే ఇవ్వలేదన్నారు. మేము పేదల అందరికీ పథకాలు అందేలా చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఇందిరమ్మ పేరు ఉంటే డబ్బులు ఇవ్వం అంటున్నారని, మీ జేబులో నుండి ఇస్తున్నారా..? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు. […]
KTR : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. భట్టి విక్రమార్క rతన “రేషన్ కార్డు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు వంటి నాలుగు పథకాలను మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని అమలు చేస్తాం” అనే ప్రకటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో ఒక గ్రామానికే మీ కాంగ్రెస్ మ్యానిఫెస్టో పరిమితమా? అని ప్రశ్నించారు. ట్విట్టర్ (ఎక్స్ )లో కేటీఆర్.. ‘ […]
Bhavani’s Nrityanjali Kalakshetram : ఎన్టీఆర్ ఆడిటోరియం, శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లో భవానిస్ నృత్యాంజలి కళాక్షేత్రం యొక్క మూడవ వార్షికోత్సవమహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. వినాయకకౌత్వం.. నారాయణతే నమో నమో.. ఆనందనర్తన గణపతి.. భో శంభో.. ముషీకవాహన.. పలుకే బంగారమాయే.. నరసింహ కౌత్వం మొదలయిన అంశాలను భవానీగారి శిష్యులు 70 మంది నృత్య ప్రదర్శనను ఇచ్చారు. ఈ కార్యక్రమం అకాడమీ విద్యార్థులు ప్రదర్శించిన మంగళం అనే అంశంతో […]
CM Revanth Reddy : పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ పురస్కారాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి ఎంపికైన ప్రముఖులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. వైద్యరంగంలో విశేష సేవలు అందించిన డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డికి పద్మవిభూషణ్, సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్, ప్రజా వ్యవహారాల విభాగంలో మంద కృష్ణ మాదిగకు, కళలు, సాహిత్యం, విద్యా విభాగాల్లో కే.ఎల్.కృష్ణ, మాడుగుల నాగఫణిశర్మ, దివంగత మిర్యాల అప్పారావు, రాఘవేంద్రాచార్య […]
Ajith Kumar : కేంద్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారమైన పద్మ అవార్డులను ప్రతి సంవత్సరం వివిధ రంగాలకు చెందిన వారికి అందజేస్తున్నారు. విద్య, సాహిత్యం, వైద్యం, క్రీడలు, సామాజిక సేవ, పరిశ్రమ వంటి వివిధ రంగాల్లో సాధించిన వారికి కూడా ఇస్తారు. ఆ విధంగా 2025లో మొత్తం 139 మందికి పద్మ అవార్డులు ప్రకటించారు. దీని ప్రకారం 7 మందికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. 23 మంది మహిళలు […]
అర్హత కలిగిన పేదలకు ఇళ్ళు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం.. కూటమి ప్రభుత్వం అర్హత కలిగిన పేదలకు ఇళ్ళు ఇవ్వడానికి కట్టుబడి ఉందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. గత ప్రభుత్వం క్షమశిక్షణ లేని ఆర్ధిక ప్రణాళికల వల్ల హౌసింగ్ ప్రోగ్రామ్ కుంటుపడిందని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన రూ.4500 కోట్లను గత ప్రభుత్వం పక్కదోవ పట్టించిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం 114,000 ఇళ్ళు పూర్తి చేసిందని.. ఫిబ్రవరి 1న తణుకు నియోజకవర్గం తేతలి గ్రామం నుంచి సీఎం చంద్రబాబు […]
Fake Currency : హనుమకొండ జిల్లాలో నకిలీ నోట్లను విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఒక లక్షకు నాలుగు రెట్లు అధికంగా నకిలీ నోట్లు అందజేస్తామని నకిలీ నోట్ల విక్రయాలకు పాల్పడతున్న ఎనిమిది మంది ముఠా సభ్యులను కేయూసి పోలీసులు అరెస్టు చేసారు. వీరి నుండి భారీ మొత్తంలో అసలు వోట్లు 34లక్షల 84వేల రూపాయలతో పాటు, 21లక్షల రూపాయల నకిలీ నోట్లు, నకిలీ నోట్ల ముద్రణకు అవరమైన తెల్లకాగితాలు, ఒక కారు, ఆటో, తొమ్మిది […]
Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా గుర్తించబడింది, ఇది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రధానంగా జరుగుతోంది. ఈ వేడుకలో లక్షలాది మంది భక్తులు, పుణ్యస్నానాలు ఆచరించేందుకు త్రివేణి సంగమంలో చేరి గంగామాతకు మనసారా పూజలు చేస్తున్నారు. ఈ వేడుక జనవరి 13న ప్రారంభమై, ఫిబ్రవరి 26 వరకు దాదాపు నలభై అయిదు రోజులపాటు కొనసాగుతుంది. పండితుల ప్రకారం, కుంభమేళా పుణ్యస్నానాలకు ప్రాముఖ్యతను ఇవ్వడం, గంగమ్మతల్లిని ఆచారమయిన విధంగా పూజించడం అత్యంత […]