KTR : తెలంగాణలో సాగునీటి సంక్షోభం మరింత తీవ్రరూపం దాలుస్తుండగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థత వల్ల గత ఏడాది కాలంగా ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ఎండిపోయాయని, సాగునీటి крైసిస్ అన్నదాతలను ఆత్మహత్యలకు దారి తీస్తోందని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 430 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకునేందుకు సరిపోతుందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు, రిజర్వాయర్లను తగిన విధంగా నిర్వహించకపోవడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాలం తెచ్చిన కరవు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షోభమని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో చెరువులు, కుంటలు నిండుకుండలను తలపించగా, కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనంతో రైతులను నీటి కోసం వర్షాలు కోసం ఎదురుచూడే పరిస్థితికి తెచ్చిందని విమర్శించారు.
Train Derailment in Odisha: పట్టాలు తప్పిన రైలు.. ప్రమాదంలో దెబ్బతిన్న మూడు బోగీలు
“పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్నదాతలకు ఇలాంటి ఇబ్బందులు రాలేదు. కానీ కేవలం ఏడాది కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నాశనం చేసింది. సాగునీటి కష్టాలు రైతులను ఆర్థికంగా నశింపజేశాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడం ఫిబ్రవరి నెల ఎండల వల్ల అని చెప్పడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం” అని మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి చేసిన “ఎండల వల్లే భూగర్భ జలాలు తగ్గిపోయాయి” అన్న వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రైతులు కళ్లముందే పంటలను కాపాడుకోలేక విలవిల్లాడుతుంటే, “బోర్లు వేయకండి” అంటూ ఆయన ఉచిత సలహాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. “రైతాంగ సంక్షోభానికి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ చేసి రిజర్వాయర్లు నింపాలి. లేకుంటే రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పటికీ క్షమించరు” అని కేటీఆర్ హెచ్చరించారు.
AP News: ఏపీలో చెత్త పన్ను రద్దు.. గెజిట్ జారీ