Wine Shops : గ్రీష్మకాలం సమీపిస్తున్న వేళ మద్యం ప్రియులకు ఊహించని షాక్. ఎండల వేడి నుండి కాస్త ఉపశమనం కోసం బీర్లు, మద్యం ఆశ్రయించే మందుబాబులకు, ఈ నెల 14వ తేదీ ప్రత్యేకంగా చేదు అనుభవం కలిగించనుంది. నగర పోలీసులు హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా, సామాజిక అసౌకర్యాన్ని నివారించేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు […]
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అలా ఎందుకు మాట్లాడారు? పక్కా సమాచారంతోనే అన్నారా? లేక ఓ రాయి వేసి చూద్దామనుకున్నారా? ప్రభుత్వంలో గులాబీ కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారన్నది నిజమేనా? కేబినెట్ మీటింగ్ అయిన వెంటనే ఒకరిద్దరు మంత్రులు నేరుగా ప్రతిపక్ష ముఖ్యుడికి ఫోన్ చేసి చెబుతున్నారన్నది నిజమేనా? అసలు తెలంగాణ సర్కార్‌లో ఏం జరుగుతోంది? రేవంత్ ఏమన్నారు? సీఎల్పీ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ విషయంలో సాఫ్ట్ […]
Tummala Nageswara Rao : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యతాలకుంట గ్రామంలో సీతారామ టన్నెల్ వద్ద వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై విశేషాలు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో సత్తుపల్లికి ప్రత్యేక గుర్తింపు ఉందని, తాను రాజకీయ చైతన్యం వచ్చినప్పటి నుండి అభివృద్ధికి కృషి చేశానని అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాల్లో రోడ్డు మార్గాలను విస్తృతంగా అభివృద్ధి చేశామని, ప్రస్తుతం ప్రతి గిరిజన గ్రామానికి రహదారులు […]
Jagadish Reddy : తెలంగాణ శాసనసభ సమావేశాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో BRS ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌పై స్పందించారు. తనపై నిషేధాన్ని అన్యాయంగా అమలు చేశారనే ఆరోపణలు చేస్తూ, అసెంబ్లీ లోపల తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. NTV తో మాట్లాడుతూ జగదీష్ రెడ్డి తనపై తప్పుడు నిర్ధారణలతో మోపారని ఆరోపించారు. “నేను స్పీకర్ పై ఎలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయలేదు. ప్రభుత్వం చేసే తప్పులను బయటపెడుతున్నానని నన్ను లక్ష్యంగా చేసుకున్నారు,” […]
Ponnam Prabhakar : తెలంగాణ శాసన సభలో బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ విధానాలపై బీజేపీ నిరాధార ఆరోపణలు చేస్తున్నదని ఆయన ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “మేము ఏ పథకాన్ని నిలిపివేయలేదని స్పష్టంగా చెప్పగలము. ప్రభుత్వం కొత్త ఉద్యోగ నియామకాలకు ప్రాధాన్యత ఇస్తోంది. కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులకు విద్యాబోధన సక్రమంగా అందించాలని సూచిస్తున్నాం” అని చెప్పారు. “రాష్ట్రానికి అప్పులు ఉన్నాయనే విషయం […]
తెలంగాణలో భారత్ సమ్మిట్ నిర్వహించబోతున్నాం.. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో భారత్ సమ్మిట్ నిర్వహించబోతున్నాం.. దానికి సంబంధించినటువంటి అంశాలపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రితో ఇవాళ చర్చిస్తాను.. డీలిమిటేషన్ అనేది సౌత్ ను లిమిటేషన్ చేయడానికే.. డీలిమిటేషన్ పై తెలంగాణలో జరిగే అఖిలపక్ష సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కచ్చితంగా హాజరు కావాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి […]
TOSS: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) 2025 సంవత్సరానికి సంబంధించిన ఎస్ఎస్సీ (SSC) , ఇంటర్మీడియట్ (Intermediate) పరీక్షల టైమ్ టేబుల్ విడుదల చేసింది. ఈ పరీక్షలు ఏప్రిల్-మే నెలల్లో నిర్వహించనుండగా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా అవి జరుగనున్నాయి. థియరీ పరీక్షలు ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 26, 2025 వరకు జరుగుతాయి. పరీక్షలు రెండు సెషన్లుగా నిర్వహించబడతాయి – ఒకటి ఉదయం, మరొకటి మధ్యాహ్నం. ఉదయం సెషన్ ఉదయం 9:00 గంటల […]
Ponnam Prabhakar : తెలంగాణ శాసన మండలిలో విద్యా వ్యవస్థపై చర్చ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఫీల్డ్ లో పరిస్థితిని పరిశీలించినప్పుడు బాధ కలుగుతోందని, ప్రస్తుత విద్యా విధానంలో మార్పు చేసి మెరుగుదల తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం తీవ్ర సమస్యగా మారింది. […]
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘర్షణాకర పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సభలో స్పీకర్‌ను ఉద్దేశించి “మీరు మేము ఎన్నుకుంటేనే స్పీకర్ అయ్యారు. ఈ సభ మీ సొంతమేం కాదు” అంటూ జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం […]
Uttam Kumar Reddy : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈ అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ, జగదీష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. గురువారం అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన మంత్రి ఉత్తమ్, ప్రజాస్వామ్యంలో స్పీకర్ పదవికి ప్రత్యేకమైన గౌరవం, అధికారాలు ఉంటాయని గుర్తు చేశారు. “ఒక సభ్యుడు స్పీకర్‌పై ఇంత […]