Kunamneni Sambasiva Rao : బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌పై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ అసెంబ్లీ లో స్పీకర్ చైర్‌కు గౌరవం ఇవ్వడం సభ్యులందరి బాధ్యత అని అన్నారు. సభ్యులు సభలో సంయమనంతో, ఆచితూచి మాట్లాడాలని సూచించారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ నిర్ణయాన్ని పునరాలోచించాలని ప్రభుత్వానికి కూనంనేని సూచించారు. ఈ సందర్భంగా, సోషల్ మీడియాలో పోస్టులపై చర్యలు తీసుకోవడం అవసరమని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నేతలపై […]
ఆ లోక్‌సభ నియోజకవర్గంలో వైసీపీ ప్రయోగం పూర్తిగా వికటించిందా? అదీ… అలా ఇలా కాకుండా… ఇప్పుడసలు ఏకంగా పార్టీకి నాయకుడే లేకుండా పోయాడా? రండి బాబూ… రండని ఆఫర్స్ మీద ఆఫర్స్ ఇస్తున్నా, ఖాళీ కుర్చీని చూపిస్తున్నా… అందులో కూర్చునే వాళ్ళు కరవయ్యారా? ఎక్కడ…. అంత సెల్ఫ్‌గోల్ వేసుకుంది వైసీపీ? కులాల ఈక్వేషన్స్ ఎలా దెబ్బతీశాయి? రాజకీయంగా జాతీయ స్థాయిలో కూడా చర్చ జరిగిన లోక్‌సభ నియోజకవర్గం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం. 2019ఎన్నికల్లో ఈ […]
అమ్మోరి సాక్షిగా…. ఆ ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందా? ఓ నామినేటెడ్ పోస్ట్ విషయమై పంతాలకు పోతున్నారా? ఇచ్చిన జీవోనే నిలిపివేయించే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ ఇద్దరి మధ్య మరో మంత్రి నలిగిపోతున్నారన్నది నిజమేనా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? ఎవరా ముగ్గురు మంత్రులు? భద్రాద్రి జిల్లా పాల్వంచ పెద్దమ్మ టెంపుల్ ఛైర్మన్ నియామకం పొలిటికల్ రంగు పులుముకుంది. అదీకూడా అలాఇలా కాదు. ఆ పోస్ట్‌ని తమ అనుచరులకు ఇప్పించేందుకు అగ్రనాయకులే పావులు […]
ఇంటర్మీడియట్ విద్యలో కీలక సంస్కరణలకు శ్రీకారం..! విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పచ్చజెండా ఊపారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 77వ సమావేశం అమరావతి అసెంబ్లీలోని పేషిలో మంత్రి లోకేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఇంటర్మీడియట్లో విద్యలో నాణ్యత ప్రమాణాలను పెంపొందించి విద్యార్థులను ప్రభుత్వ జూనియర్ కాలేజీల వైపు ఆకర్షించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రైవేటు కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ […]
ప్రత్యర్థి బలంగా ఉన్న నియోజకవర్గంలో… మరింత సమన్వయంతో పని చేయాల్సిన చోట ఆ టీడీపీ లీడర్స్ ఇద్దరూ ఇగోలకు పోతున్నారా? చివరికి నువ్వెంత అంటే… నువ్వెంత అనుకోవడమేగాక వార్నింగ్స్ ఇచ్చుకునేదాకా వెళ్లిందా? పార్టీ పెద్దలు తలంటినా…. మా దారి మాదేనన్నట్టుగా ఉన్నారా? వీళ్ళ మధ్య కేడర్ నలిగిపోతున్న పరిస్థితి ఏ నియోజకవర్గంలో ఉంది? ఎవరా ఇద్దరు నాయకులు? పులివెందుల పాలిటిక్స్‌లోకి వైఎస్ ఫ్యామిలీ ఎంటరయ్యాక మరో వ్యక్తి గెలిచిన దాఖలాలు లేవు. అలాంటి చోట మరింత సమన్వయంతో […]
MLC Vijayashanti : తెలంగాణ రాజకీయాల్లో విజయశాంతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆమె బీఆర్ఎస్పై, కేసీఆర్‌పై, అలాగే బీజేపీ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ పార్టీని బలవంతంగా విలీనం చేశారని ఆమె ఆరోపించారు. విజయశాంతి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో తాను కేసీఆర్ కంటే ముందే క్రియాశీలంగా పాల్గొన్నానని, తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌కు సొంతం కాదని స్పష్టం చేశారు. “నా పార్టీని బలవంతంగా విలీనం చేశారు. తెలంగాణ కోసం […]
ఆ ఉమ్మడి జిల్లాలో తగ్గదే…లే… అంటున్నారట తెలుగు తమ్ముళ్లు. మీరు మర్చిపోదామనుకున్నా… మేం పోనివ్వమంటూ… సోషల్ మీడియా తవ్వకాలు జరిపి పాత వీడియోల్ని వెదికి పట్టుకుని మరీ కొత్తగా సర్క్యులేట్ చేస్తున్నారట. నాడు మమ్మల్ని ఓ ఆటాడేసుకున్న వాళ్ళని అంత తేలిగ్గా వదులుతామా అని అంటున్నారట. ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? టీడీపీ లీడర్స్ తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది? పవర్లోకి వచ్చాక పగ…పగ… అని రగిలిపోతున్నారట ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, […]
Wine Shops : గ్రీష్మకాలం సమీపిస్తున్న వేళ మద్యం ప్రియులకు ఊహించని షాక్. ఎండల వేడి నుండి కాస్త ఉపశమనం కోసం బీర్లు, మద్యం ఆశ్రయించే మందుబాబులకు, ఈ నెల 14వ తేదీ ప్రత్యేకంగా చేదు అనుభవం కలిగించనుంది. నగర పోలీసులు హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా, సామాజిక అసౌకర్యాన్ని నివారించేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు […]
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అలా ఎందుకు మాట్లాడారు? పక్కా సమాచారంతోనే అన్నారా? లేక ఓ రాయి వేసి చూద్దామనుకున్నారా? ప్రభుత్వంలో గులాబీ కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారన్నది నిజమేనా? కేబినెట్ మీటింగ్ అయిన వెంటనే ఒకరిద్దరు మంత్రులు నేరుగా ప్రతిపక్ష ముఖ్యుడికి ఫోన్ చేసి చెబుతున్నారన్నది నిజమేనా? అసలు తెలంగాణ సర్కార్‌లో ఏం జరుగుతోంది? రేవంత్ ఏమన్నారు? సీఎల్పీ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ విషయంలో సాఫ్ట్ […]
Tummala Nageswara Rao : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యతాలకుంట గ్రామంలో సీతారామ టన్నెల్ వద్ద వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై విశేషాలు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో సత్తుపల్లికి ప్రత్యేక గుర్తింపు ఉందని, తాను రాజకీయ చైతన్యం వచ్చినప్పటి నుండి అభివృద్ధికి కృషి చేశానని అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాల్లో రోడ్డు మార్గాలను విస్తృతంగా అభివృద్ధి చేశామని, ప్రస్తుతం ప్రతి గిరిజన గ్రామానికి రహదారులు […]