Raghunandan Rao : ఢిల్లీ లోని తెలంగాణ భవన్ లో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల ధర్నా నిర్వహించారు. HCU భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టారు. HCU భూముల వేలాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, ఎకరా భూమి 80 – 100 కోట్ల రూపాయలు ఉందన్నారు బీజేపీ ఎంపీలు. విద్యార్దులు ఉద్యమాలు చేస్తుంటే పోలీసులను ఉసి గోల్పి జైళ్ళ పాలు చేస్తుందని, విశ్వ విద్యాలయ భూమిని నాశనం చేస్తూ పర్యావరణానికి నష్టం కలగజేస్తున్నారని బీజేపీ ఎంపీలు వ్యాఖ్యానించారు.
ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. హెచ్‌సీయూకి ఇందిరమ్మ ఇచ్చిన 2400 ఎకరాల భూమిలో 400 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డికి అమ్ముకునే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. హైడ్రా పేరుతో పర్యావరణాన్ని కాపాడుతామని హెచ్‌సీయూ భూముల విషయంలో పర్యావరణానికి నష్టం చేస్తున్నారని, పర్యావరణ పరిరక్షణ కు ఎన్జీటి లో పిటిషన్ వేస్తామన్నారు. హైకోర్టు లో పిల్ పై విచారణ జరగబోతుందని, రాహుల్ గాంధీకి HCU కనిపించడం లేదా అని ఆయన మండిపడ్డారు. జంతర్ మంతర్ లో ధర్నా ముగిసిన తరువాత రాహుల్ గాంధీ హెచ్‌సీయూకి రావాలన్నారు. 2024లో ప్రైవేట్ వ్యక్తుల భూములు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని, భూముల అమ్మకాన్ని ఆపేందుకు పోరాడుతామని రఘునందర్ రావు తెలిపారు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేశారని బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ విమర్శించి, ఇప్పుడు భూములు అమ్ముతూ అదే తప్పు చేస్తున్నారని, విశ్వవిద్యాలయ భూములు అమ్ముతూ పర్యావరణానిక నష్టం చేస్తున్నారన్నారు. విద్యార్ధులపై కేసులు తొలగించాలని, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ ను కలిసి పరిస్థితి వివరించామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ భూమి అయితే ఏదైనా చేయొచ్చా అని ఆయన వ్యాఖ్యానించారు. భూముల వేలాన్ని ఆపుతామని, అవసరమైతే కోర్టుకు వెళతామని ఆయన తెలిపారు.
ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. హెచ్‌సీయూ భూముల వేలాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎకరా భూమి 80 – 100 కోట్ల రూపాయలు ఉందని, విద్యార్దులు ఉద్యమాలు చేస్తుంటే పోలీసులను ఉసి గోల్పి జైళ్ళ పాలు చేస్తుందన్నారు ఈటల రాజేందర్. విశ్వ విద్యాలయ భూమిని నాశనం చేస్తూ పర్యావరణానీకి నష్టం కలగజేస్తున్నారని, ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని రియల్ ఎస్టేట్ చేస్తున్నారని, భూములను అమ్మితే ఊరుకోం ఖబడ్దార్ అని ఆయన వ్యాఖ్యానించారు. విద్యార్ధులకు అండగా బీజేపీ ఉంటుందని, విద్యార్ధుల పై పెట్టిన కేసులు ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు.
Arya2 : ఆర్య 2 రీరిలీజ్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్