Pochampally Srinivas : ఫాంహౌస్ కేసులో కోడిపందేలు, క్యాసినో నిర్వహణ ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని నేడు పోలీసులు విచారించారు. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన ఈ విచారణలో, ఫాంహౌస్ లీజుకు సంబంధించిన వివరాలను, ఘటనకు సంబంధించి ఆయన పాత్రపై ప్రశ్నలు వేసినట్టు సమాచారం. విచారణకు హాజరైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వెంట న్యాయవాది , ఫాంహౌస్ లీజుకు తీసుకున్న వ్యక్తి ఉన్నప్పటికీ, వారిని లోపలికి అనుమతించలేదు. అనంతరం విచారణ ముగిసిన తర్వాత […]
ఆ టీడీపీ ఎమ్మెల్యే తనను ఎన్నుకున్న నియోజకవర్గానికి గెస్ట్ ఆర్టిస్ట్ అయిపోయారా? తనకున్న ఏవేవో రాజకీయ అసంతృప్తుల్ని సెగ్మెంట్ మీద చూపిస్తున్నారా? దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా….. ఆయనగారి తమ్ముడు గారు చెలరేగిపోతున్నారా? ఎమ్మెల్యే కాదు… అంతకు మించి అన్నట్టు అనధికారిక దర్పం ఒలకబోస్తున్నారా? ఎవరా ఎమ్మెల్యే? ఆయన షాడో? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలిటిక్స్‌లో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నారు మాజీ మంత్రి కొండ్రు మురళీమెహన్. ప్రస్తుతం తాను సిట్టింగ్గా ఉన్న […]
Strange Tradition : హోలీ పండుగ అంటే రంగుల, ఆనందోత్సాహాల సంబరాలు. అయితే, తెలంగాణలోని కొన్ని గ్రామాల్లో హోలీ వేడుకలు ప్రత్యేకమైన సంప్రదాయాలతో జరుపుకుంటారు. అందులో ఓ వింత ఆచారం నిజామాబాద్ జిల్లా హున్సా గ్రామంలో ఉంది. హనుమాన్ ఆలయం వద్ద ప్రతి ఏటా హోలీ పండుగ సందర్భంగా గ్రామస్థులు పరస్పరంగా పిడిగుద్దులాటలో పాల్గొంటారు. ఈ ఆచారాన్ని కొనసాగించేందుకు పోలీసులు కూడా షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. వృథా గొడవలు లేకుండా నియంత్రణలో ఉంచేందుకు, పిడిగుద్దులాటను కేవలం […]
Holi 2025 : హోలీ పండుగ ప్రేమ , సామరస్యానికి చిహ్నం. హోలీ అనేది రంగులతో ఆడుకునే పండుగ మాత్రమే కాదు, ఇది భారతదేశ గంగా-జముని సంస్కృతి యొక్క ఉమ్మడి వారసత్వాన్ని కూడా ప్రదర్శిస్తుంది. నేటి రాజకీయ యుగంలో, హోలీపై రాజకీయాలు హిందూ-ముస్లిం పేరుతో వేడెక్కుతున్నప్పటికీ, మీరు చరిత్రను పరిశీలిస్తే, అందరూ కలిసి హోలీ పండుగను జరుపుకుంటున్న అనేక ప్రదేశాల గురించి ప్రస్తావించబడుతుంది. నేటికీ, అన్ని మతాల ప్రజలు కలిసి హోలీ ఆడి ప్రేమ రంగులతో గులాబీ […]
బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఈడీ దూకుడు.. బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దూకుడు పెంచారు. హైదరాబాద్ నగరంలోని బండ్లగూడలో నమోదైన కేసులో ఆస్తులను అటాచ్ చేసింది. బ్యూటిషన్, టైలరింగ్ పేరుతో హైదరాబాద్ వచ్చిన యువతులు.. వివిధ వృత్తుల పేరుతో హైదరాబాద్ వచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. బంగ్లాదేశ్ యువతులను హైదరాబాద్ రప్పించి వ్యభిచారం చేయించిన ముఠా.. తాజాగా ఖైరతాబాద్, సనత్ నగర్, చాదర్ ఘాట్ లో మూడు కేసులు నమోదు చేశారు. ఇక, […]
Holi 2025: హైదరాబాద్ నగరంలోని దూల్పేట్లో హోలీ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతుండగా, కొన్ని ప్రాంతాల్లో గంజాయితో తయారైన కుల్ఫీ, ఐస్ క్రీమ్, బాదాం మిల్క్, స్వీట్స్ విక్రయాలు జరుగుతున్నాయి. ఈ మత్తు పదార్థాల విక్రయంపై నిఘా పెట్టిన ఎక్సైజ్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF) బృందం దూకుడుగా దాడులు నిర్వహించి అనేక మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. హోలీ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈవెంట్స్‌లో హానికరమైన మత్తు పదార్థాలను ప్రజలకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. […]
Human Trafficking : వరంగల్‌లో ఓ మహిళ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కిలేడీ గ్యాంగ్ అమాయక బాలికలను టార్గెట్ చేస్తూ పాశవిక దుశ్చర్యలకు పాల్పడుతోంది. మత్తుమందులకు బానిసై, ఈజీ మనీ కోసం బలహీన స్థితిలో ఉన్న బాలికలను లొంగదీసే ఈ ముఠా ఘోరాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా దామెర మండలానికి చెందిన ఓ మహిళ వరంగల్ మిల్స్ కాలనీలో నివాసం ఉంటోంది. డ్రగ్స్‌కు బానిసైన ఆమె తనతో పాటు మరికొంత మందితో కలిసి గ్యాంగ్ ఏర్పరచుకుంది. […]
KTR : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే ఢిల్లీ పర్యటనలు చేస్తూ, అక్కడి నుంచి రాష్ట్రానికి ఎటువంటి నిధులు తీసుకురాలేకపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి రేవంత్ రెడ్డి మొత్తం 39 సార్లు ఢిల్లీకి వెళ్లినప్పటికీ, రాష్ట్రాభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోయారని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ తీరు “గల్లీలో హోదా మరిచి తిట్లు, ఢిల్లీలో చిట్చాట్లు” అన్నట్లు ఉందని, తన కార్యాలయం దాటి బయటకి […]
Raghunandan Rao : తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనుమతించకపోతే, రాష్ట్రంలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు కలిసి తిరుమలలో టీటీడీ అధికారులతో తేల్చుకుంటామని మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు హెచ్చరించారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల ద్వారా భక్తులకు దర్శన అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు, […]
పాలకుర్తి కాంగ్రెస్‌లో రచ్చకు కారణం ఎవరు? సొంత పార్టీ నేతలేనా? లేక బయట వ్యక్తుల ప్రమేయం ఉందా? కాంగ్రెస్‌లో ఉంటూ పక్క పార్టీకి కోవర్ట్‌లు పనిచేస్తున్నారన్న ఆరోపణల్లో నిజం ఎంత? ఇంతకూ ఆసలు పాలకుర్తి కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట ఓ రేంజ్లో జరుగుతోంది. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఆమె అత్త ఝాన్సీరెడ్డికి వ్యతిరేకంగా మొదలైన ఫిర్యాదుల పరంపర గాంధీ భవన్ వరకు చేరింది. దీంతో ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంటి పొలిటికల్ సీనియర్ని […]